సర్టిఫికెట్‌ ఆఫ్‌ గుడ్‌ కండక్ట్‌: ఇకపై తప్పనిసరి

- February 03, 2018 , by Maagulf
సర్టిఫికెట్‌ ఆఫ్‌ గుడ్‌ కండక్ట్‌: ఇకపై తప్పనిసరి

వర్క్‌ వీసా కోసం ఇకపై సర్టిఫికెట్‌ ఆఫ్‌ గుడ్‌ కండక్ట్‌ తప్పనిసరి. యూఏఈలో ఈ నిబంధనను ఫిబ్రవరి 4 నుంచి అమల్లోకి తెస్తున్నారు. హై లెవల్‌ ప్యానల్‌ ఈ విషయమై ఇదివరకే ప్రకటన చేసింది. సోమవారం దీనికి అప్రూవల్‌ లభించగా, ఫిబ్రవరి 4 నుంచి అమల్లోకి తీసుకు రావడం జరుగుతోంది. యూఏఈలో వర్క్‌ వీసా కోసం ఏ దేశస్తులైతే దరఖాస్తు చేసుకుంటారో, ఆ దేశం నుంచి వారు గుడ్‌ కండక్ట్‌ సర్టిఫికెట్‌ని పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని స్టేట్స్‌ మిషన్‌, అలాగే యూఏఈ మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌ రాటిఫై చేస్తుంది. విజిట్‌ వీసాపై వచ్చేవారికి ఈ నిబంధన వర్తించదు. యూఏఈని సేఫెస్ట్‌ కంట్రీగా వుంచే క్రమంలో ఈ చర్య తీసుకున్నట్లు కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com