తెలంగాణా టీ ట్వంటీ లీగ్‌లో ఆడుతున్న టాలీవుడ్ స్టార్స్...
- February 03, 2018
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న తెలంగాణా టీ ట్వంటీ లీగ్‌కు ఉప్పల్ స్టేడియంలో తెరలేచింది. భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్, మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ఈ లీగ్‌ను ప్రారంభించారు. తెలంగాణా వ్యాప్తంగా జిల్లాల్లో మ్యాచ్‌లు నిర్వహించి ఎంపిక చేసిన అత్యుత్తమ ప్లేయర్లతో 10 జట్లు లీగ్‌లో తలపడుతున్నాయి. రంజీ ఆటగాళ్ళతో పాటు టాలీవుడ్ స్టార్స్ అక్కినేని అఖిల్, సుధీర్‌బాబు ఈ లీగ్‌లో ఆడుతున్నారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో క్రికెటర్లను ప్రోత్సహించేందుకు లీగ్ నిర్వహిస్తోన్న హెచ్‌సిఎ ప్రెసిడెంట్ వివేక్‌ను కపిల్‌దేవ్ అభినందించారు. రానున్న రోజుల్లో తెలంగాణా నుంచి జాతీయ జట్టులో పలువురు ఆటగాళ్ళు చోటు దక్కించుకోవాలని ఆకాంక్షించారు. లీగ్ ఆరంభ వేడుకల్లో టాలీవుడ్ హీరోలు వెంకటేష్ , శ్రీకాంత్ సందడి చేశారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు