తెలంగాణా టీ ట్వంటీ లీగ్‌లో ఆడుతున్న టాలీవుడ్ స్టార్స్...

- February 03, 2018 , by Maagulf
తెలంగాణా టీ ట్వంటీ లీగ్‌లో ఆడుతున్న టాలీవుడ్ స్టార్స్...

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న తెలంగాణా టీ ట్వంటీ లీగ్‌కు ఉప్పల్ స్టేడియంలో తెరలేచింది. భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్, మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్‌ ఈ లీగ్‌ను ప్రారంభించారు. తెలంగాణా వ్యాప్తంగా జిల్లాల్లో మ్యాచ్‌లు నిర్వహించి ఎంపిక చేసిన అత్యుత్తమ ప్లేయర్లతో 10 జట్లు లీగ్‌లో తలపడుతున్నాయి. రంజీ ఆటగాళ్ళతో పాటు టాలీవుడ్ స్టార్స్ అక్కినేని అఖిల్, సుధీర్‌బాబు ఈ లీగ్‌లో ఆడుతున్నారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో క్రికెటర్లను ప్రోత్సహించేందుకు లీగ్ నిర్వహిస్తోన్న హెచ్‌సిఎ ప్రెసిడెంట్ వివేక్‌ను కపిల్‌దేవ్ అభినందించారు. రానున్న రోజుల్లో తెలంగాణా నుంచి జాతీయ జట్టులో పలువురు ఆటగాళ్ళు చోటు దక్కించుకోవాలని ఆకాంక్షించారు. లీగ్ ఆరంభ వేడుకల్లో టాలీవుడ్ హీరోలు వెంకటేష్ , శ్రీకాంత్ సందడి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com