సరికొత్తగా అమీర్..గరీబ్ ఫేస్బుక్ చెప్పేస్తుంది

- February 04, 2018 , by Maagulf
సరికొత్తగా అమీర్..గరీబ్ ఫేస్బుక్ చెప్పేస్తుంది

- ప్రత్యేకసాఫ్ట్‌వేర్‌ రూపకల్పన 
- పేటెంట్‌ కోసం దరఖాస్తు 
లండన్‌ : మీరుగనుక 'ఫేస్‌బుక్‌' వాడుతున్నారా ? అయితే మీ ఆర్థిక-సామాజిక స్థాయి ఏంటన్నది ఫేస్‌బుక్‌ చెప్పేస్తుంది. నువ్వు పేదవాడివా, ధనికుడివా ? మధ్య తరగతికి చెందినవాడివా ? అనే అంశాలతో పాటు మరికొన్ని వ్యక్తిగత అంశాలూ 'ఫేస్‌బుక్‌' వద్ద ఉంటాయి. ఇదెలా సాధ్యమంటారా ? సామాజిక మాధ్యమంలో ఉండేవారి వ్యక్తిగత సమాచారానికి సంబంధించి ఒక ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని 'ఫేస్‌బుక్‌' తయారుచేసింది. ఈ సాంకేతికతపై తమకు పేటెంట్‌ ఇవ్వాల్సిందిగా దరఖాస్తు సైతం చేసుకుంది. విద్య, ఇంటర్నెట్‌ వాడకం, స్వంత ఇల్లు ఉందా? లేదా ?...తదితర అంశాల ఆధారంగా ఫేస్‌బుక్‌ వాడకందార్ల సామాజిక-ఆర్థిక స్థాయిని అంచనావేస్తూ సంస్థ ఓ నివేదిక తయారుచేస్తుందని 'డెయిలీమెయిల్‌' శనివారంనాడు సంచలన వార్తను ప్రచురించింది.సామాజిక మాధ్యమంలో ఉండేవారి ఆసక్తులు, ఆర్థిక, సామాజిక స్థాయిలకు అనుగుణమైన అడ్వర్టయిజ్‌మెంట్స్‌ ఇవ్వడానికి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడతామని 'పేటెంట్‌' దరఖాస్తులో ఫేస్‌బుక్‌ తెలియజేసింది. అలాగే ఉత్పత్తులను ప్రమోట్‌ చేసుకునే థర్డ్‌ పార్టీ సంస్థలకు సమాచారం అందజేస్తామని ఫేస్‌బుక్‌ పేర్కొంది. 
పలు ప్రశ్నలతో తొలుత వాడకందార్ల నుంచి ఫేస్‌బుక్‌ సమాచారం సేకరిస్తుంది. వివిధ వయస్సుల వారికి వివిధ రకాల ప్రశ్నావళి ఉంటుంది. ఈ సమాచామంతటినీ సాంకేతపరిజ్ఞానం ఒక క్రమ పద్ధతిలో విడగొట్టి, విశ్లేషణ చేసి ఓ నివేదిక రూపొందిస్తుంది. అయితే ఫేస్‌బుక్‌ ఎవరి దగ్గరి నుంచీ ఆదాయ వివరాలు మాత్రం సేకరించటం లేదట. కారణం ఆదాయానికి సంబంధించి ఎవరూ వాస్తవం చెప్పరని నమ్ముతోందట. కానీ, ఫేస్‌బుక్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో వాడకందార్లు నిర్వహిస్తున్న కార్యకలాపాలను మాత్రం పరిగణలోకి తీసుకుంటారని 'డెయిలీ మెయిల్‌' కథనం పేర్కొన్నది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com