ఎయిర్ ఏషియా ఎక్స్... భారీ డిస్కౌంట్లు..
- November 24, 2015
విమాన టికెట్లకు సంబంధించి ఎయిర్ఏషియా, ఎయిర్ ఏషియా ఎక్స్... భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి.తమ బిగ్‌సేల్‌లో భాగంగా పుణే, గోవా, కోచి, గౌహతి, వైజాగ్ వంటి దేశీయ రూట్లలో విమాన టికెట్లు రూ.990 (అన్ని చార్జీలు కలుపుకొని)నుంచి ప్రారంభమవుతాయని ఎయిర్ ఏషియా గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సీగ్ట్రాండ్ టెక్ పేర్కొన్నారు. అలాగే బ్యాంకాక్, కౌలాలంపూర్, వంటి అంతర్జాతీయ నగరాలకు తమ గ్రూప్ విమానాల ద్వారా జరిపే విమాన ప్రయాణాలకు చార్జీలను రూ.3,699కు ఆఫర్ చేస్తున్నామని వివరించారు. ఈ నెల 29 వరకూ ఎయిర్ఏషియాడాటకామ్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని, ప్రయాణ కాలం వచ్చే ఏడాది మే 1 నుంచి 2017 ఫిబ్రవరి 5 వరకూ ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నుంచి న్యూఢిల్లీ నుంచి కౌలాలంపూర్‌కు డెరైక్ట్ విమాన సర్వీస్‌ను ఎయిర్ ఏషియా ఎక్స్ నుంచి అందిస్తున్నామని వివరించారు.
తాజా వార్తలు
- కువైట్ వెదర్ అలెర్ట్..రెండు రోజులపాటు వర్షాలు..!!
- సోహార్‌లోని కార్మికుల వసతి గృహంలో అగ్నిప్రమాదం..!!
- ట్రంప్ శాంతి మండలిలో చేరిన ఖతార్..!!
- బంగారం ధర $5,000కి చేరుకుంటుందా?
- బహ్రెయిన్ ఆటమ్ ఫెయిర్..24 దేశాల నుండి 600 మంది ఎగ్జిబిటర్లు..!!
- సౌదీలో అమల్లోకి సౌదీయేతర రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ రెగ్యులేషన్స్..!!
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు







