రక్త నమూనాలను పాడు చేసి ఆరోగ్య నివేదికలను తారుమారుచేస్తున్న ముఠా అరెస్టు
- February 04, 2018
కువైట్ : తల్లిపాలను..మానవ రక్తాన్ని కల్తీ చేయలేమని గతంలో ఓ భావన సమాజంలో ఉండేది. కాల గమనంలో అవి సైతం నకిలీబాట పట్టాయి.ఆరోగ్య మంత్రిత్వ శాఖలో విభాగమైన విదేశీ లేబర్ పరీక్ష కేంద్రంలో పనిచేస్తున్న ఒక బృందంలోని సభ్యులు ఉద్దేశ్యపూర్వకంగా పలువురి రక్త పరీక్ష నమూనాలను పాడుచేశారని దాంతో వీరందరిని అరెస్టు చేశారని మంత్రిత్వశాఖ ప్రజా ఆరోగ్య సహాయ కార్యదర్శి డాక్టర్ మజ్దా అల్-ఖ్అత్తాన్ శుక్రవారం చెప్పారు. బుధవారం నాడు నల్గురు ఈజిప్షియన్లకు హెపటైటిస్, క్షయ మరియు ఎయిడ్స్ తదితర వ్యాధుల నిర్ధారణ కోసం నాలుగు న పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ విదేశీ లేబర్ పరీక్ష కేంద్రంను కోరినట్లు అల్-ఖ్అత్తాన్ " మా గల్ఫ్ డాట్ కామ్ " ప్రతినిధికి తెలిపారు. ఆ నలుగురి రక్తనమూనా ఫలితాలు గురువారం తెలిశాయి. ఇద్దరు ఈజిప్షియన్లకు హెపటైటిస్- బి మరియు మరో ఇద్దరు ఈజిప్షియన్లకు హెపటైటిస్- సి ఉన్నట్లు సూచిస్తూ క్షయ పరీక్షలు సైతం వ్యతిరేకంగా ఉన్నట్లు విదేశీ లేబర్ పరీక్ష కేంద్రంలో పనిచేస్తున్న విదేశీ మహిళ ఓ నివేదిక అందించారు. రక్త నమూనాలను తీసుకున్న గది మరియు ప్రయోగశాల గదిలోనికి వెళ్ళేటప్పుడు నిఖార్సుగా పరీక్షల ఫలితాలను వెల్లడించక వాటిని పాడుచేసి వారికి ఇష్టమొచ్చిన రీతిలో ఫలితాలు అందచేస్తున్నారని ఆరోపణ పరీక్ష కేంద్రంలో పనిచేస్తున్న బృందంలోని సభ్యులపై ఉంది. నాలుగు నెలల క్రితమే వీరి మోసంపై అంతర్గత వ్యవహారాల శాఖ విదేశీ ఉద్యోగుల పరీక్షా కేంద్రం అధికారుల పర్యవేక్షణలో ఉంది. ఈ మహిళ నిర్వాకం పసిగట్టిన ఒక సెక్యూరిటీ గార్డు మరియు ఆరోగ్యం మంత్రిత్వశాఖ ఇన్స్పెక్టర్ ఆధారాలతో సహా ఆ మహిళను మిగతా బృందాన్ని పట్టుకొన్నారు. పరీక్షల నుంచి తప్పించడాని రోగాల బారినపడిన వారిని పూర్తి ఆరోగ్యవంతులుగా పత్రం ఇవ్వడం నకిలీ స్టాంపులు ఆయా నివేదికలపై ముద్రించడానికి ఆ ఈజిప్టియన్ మహిళ నేతృత్వంలో మిగతా ముఠా సభ్యులు పనిచేస్తున్నట్లు తనిఖీ అధికారులు పూర్తి ఆధారాలతో ఆరోగ్య మంత్రిత్వ శాఖకు అందించారు. "ఈ మహిళ కలుషిత నమూనాలను మంచి ఆరోగ్యంతో ఉన్నట్లు స్టాంపును ముద్రించి ప్రమాదకర రోగులు ఈ ముఠా సహకారంతో దేశంలోకి ప్రవేశించడానికి పరోక్ష కారణమైంది. ఈ తరహా ఫోర్జరీని నివారించడానికి ఆరోగ్య మంత్రిత్వశాఖ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖతో సమన్వయంతో నివారించనున్నట్లు మంత్రిత్వశాఖ ప్రజా ఆరోగ్య సహాయ కార్యదర్శి డాక్టర్ మజ్దా అల్-ఖ్అత్తాన్ తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి