పాత నెంబర్‌ పేట్లుంటే వాహనం సీజ్‌

- February 05, 2018 , by Maagulf
పాత నెంబర్‌ పేట్లుంటే వాహనం సీజ్‌

మనామా: వాహనాలకు పాత నెంబర్‌ ప్లేట్లు ఉంటే ఇకపై వాటిని సీజ్‌ చేస్తారు. ఈ సీజ్‌ నిర్ణయం మార్చి 1 నుంచి అమల్లోకి వస్తుంది. కొత్త నెంబర్‌ ప్లేట్లను ప్రతి ఒక్కరూ తమ వాహనానికి బిగించుకోవాలంటూ జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌ సూచిస్తూ, మార్చి 1 తర్వాత కూడా వాహనాలకు పాత నెంబర్‌ ప్లేట్లు వుంటే, అలాంటి వాటిని సీజ్‌ చేస్తామని స్పష్టం చేశారు. సీజ్‌ చేయడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడం వంటి ఇబ్బందుల నుంచి వాహనదారులు ముందే అప్రమత్తమవ్వాలని జనరల్‌ డైరెక్టరేట్‌ స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com