విక్టరీ వెంకటేష్ సమస్యగా మారిన ఆ ఇద్దరి పిల్లల తల్లి !

- February 05, 2018 , by Maagulf
విక్టరీ వెంకటేష్  సమస్యగా మారిన ఆ ఇద్దరి పిల్లల తల్లి !

సీనియర్ వెంకటేష్ కు ఇద్దరి పిల్లల తల్లి సమస్యగా మారడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. వెంకటేష్ ఎన్నో కథలు విన్న తరువాత దర్శకుడు తేజ చెప్పిన ఒక వెరైటీ కథకు ఓకె చెప్పిన విషయం తెలిసిందే. ఒక మళయాళ సినిమా కథకు మార్పులు చేర్పులు చేసి తేజ వెంకటేష్ వయసుకు సరిపడే విధంగా ఈమూవీలోని వెంకీ పాత్రను డిజైన్ చేసాడు.సినిమా కథకు అనుగుణంగా మధ్య వయస్కుడైన వెంకటేష్ ఇద్దరు పిల్లల తండ్రిగా కనిపిస్తాడు. అయితే వెంకటేష్ కు అప్పటికే భార్య చనిపోయి ఉంటుంది. ఇలాంటి పరిస్థుతులలో వెంకటేష్ ను ప్రేమించే ఒక అమ్మాయి చుట్టూ ఈకథ నడుస్తుంది. ఇక్కడే అసలైన సమస్య వచ్చింది అని అంటున్నారు. ఇప్పటికే ప్రారంభం జరిగిన ఈమూవీ స్క్రిప్ట్ అంతా రెడీ అయినా హీరోయిన్ దొరకడం లేదు.భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినా ఈసినిమాలో వెంకటేష్ పక్కన నటించడానికి కాజల్ అదితి రావ్ హైదరి నిత్యామీనన్ నివేతా థామస్ లాంటి చాలామంది హీరోయిన్స్ వెంకీ పక్కన ఒప్పుకున్నట్లే ఒప్పుకుని వెంటనే మళ్ళీ డ్రాప్ అయిపోతున్నట్లు టాక్. దీనికి కారణం వెంకటేష్ ఇద్దరి పిల్లలకు తల్లిగా నటించడం ఈ గ్లామర్ హీరోయిన్స్ ఎవ్వరికీ ఇష్టం లేదట.అయితే ప్రస్తుతం అవకాశాలు లేక సతమతమవుతున్న కొందరు హీరోయిన్స్ అలాగే మిడిల్ ఏజ్ వచ్చినా ఇంకా గ్లామర్ గా కనిపిస్తున్న మరికొంతమంది హీరోయిన్స్ వెంకటేష్ పక్కన నటించడానికి ఒప్పుకుంటూ ఉన్నా వెంకీకి వాళ్ళు ఎవ్వరూ నచ్చడం లేదట. దీనితో దర్శకుడు తేజా వెంకటేష్ ను ఈమూవీకి సంబంధించి ఎలా ఒప్పించాలో తెలియక ఇప్పటికే తేజ ఒప్పుకున్న ఎన్టీఆర్ బయోపిక్ ను ఎప్పుడు మొదలు పెట్టాలో తెలియక చేతిలో రెండు భారీ సినిమాలు ఉన్నా రకరకాల సమస్యలతో ముందుకు వెళ్ళలేని పరిస్థుతులలో ఉన్నాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com