దుబాయ్‌లో భారతీయులకు గుడ్‌ కండక్ట్‌ సర్టిఫికెట్‌ ఎలా?

- February 05, 2018 , by Maagulf
దుబాయ్‌లో భారతీయులకు గుడ్‌ కండక్ట్‌ సర్టిఫికెట్‌ ఎలా?

ఇండియన్‌ జాబ్‌ సీకర్స్‌, పోలీస్‌ క్లియరెన్స్‌ - గుడ్‌ కండక్ట్‌ సర్టిఫికెట్‌ కోసం యూఏఈలో బిఎల్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ ద్వారా అప్లయ్‌ చేసుకోవచ్చు. ఈ సంస్థ వీసా, పాస్‌పోర్ట్‌, కాన్సులర్‌, అటెస్టేషన్‌ సర్వీసుల్ని అందిస్తుంది. పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ని ఇండియా నుంచి పొందడానికి, అప్లికేషన్‌ ఫామ్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుని, దాన్ని నింపాల్సి ఉంటుంది. పాత పీసీసీ కాపీనీ, ప్రస్తుత పాస్‌పోర్ట్‌ డిటెయిల్స్‌ని యూఏఈ అథారిటీస్‌ నుంచి తెప్పించుకుని, జత చేయాల్సి ఉంటుంది. దేనికోసం పిసిసి సర్టిఫికెట్‌ పొందాలనుకుంటున్నారో పేర్కొంటూ రిక్వెస్ట్‌ లెటర్‌, సపోర్టింగ్‌ డాక్యుమెంట్స్‌తో జత చేయాలి. సిజిఐ దుబాయ్‌ / ఎంబసీ ద్వారా పిసిసి అప్లికేషన్‌కి క్లియరెన్స్‌ తెచ్చుకోవాలి. వీసా గడువు తీరి, గ్రేస్‌ పీరియడ్‌ ఉంటే, పనిచేస్తున్న కంపెనీ నుంచి ఇంగ్లీషులో టెస్టిఫైడ్‌ లెటర్‌ తీసుకురావాలి. డిపెండెంట్స్‌ అయితే స్పాన్సరర్స్‌ ఫొటో టెస్టిఫైడ్‌ లెటర్‌, పాస్‌పోర్ట్‌ కాపీ అవరమవుతుంది. కొత్త ఎంప్లాయ్‌మెంట్‌ కోసమైతే ఆఫర్‌ లెటర్‌ (ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌) ద్వారా అటెస్ట్‌ చేయబడి ఉండాలి. ఫోటో ఐడీ కార్డ్‌ కాపీ తప్పనిసరి. డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఐడీ, ఎమిరేట్స్‌ ఐడీ కార్డ్‌, హెల్త్‌ కార్డ్‌, లేబర్‌ కార్డ్‌ డిటెయిల్స్‌ ఇవ్వాలి. ఐడెంటిపికేషన్‌ కోసం దరఖాస్తుదారుడు వ్యక్తిగతంగా ఆ దరఖాస్తును సమర్పించాల్సి వుంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com