సౌదీ సంచలన నిర్ణయం.. భారతీయలకు షాక్!

- February 06, 2018 , by Maagulf
సౌదీ సంచలన నిర్ణయం.. భారతీయలకు షాక్!

రియాద్‌ః దేశంలో ఉన్న కోటి 20 లక్షల మంది విదేశీ వర్కర్లకు నష్టం చేకూర్చే నిర్ణయం తీసుకున్నది సౌదీ అరేబియా. స్థానికంగా నిరుద్యోగ సమస్యను అధిగమించడానికి దేశంలోని 12 రంగాల్లో విదేశీ వర్కర్లను తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసింది. ఆ దేశ కార్మికశాఖ మంత్రి అలీ బిన్ నాజర్ అల్ గఫీజ్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. సౌదీ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా దేశంలోని కోటి 20 లక్షల మంది విదేశీ వర్కర్లు ఇప్పుడు దేశం వదిలి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. సౌదీ స్థానికులు వద్దని వదిలేసిన ఎన్నో ప్రమాదకర, తక్కువ స్థాయి ఉద్యోగాల్లో ఈ విదేశీయులు పనిచేస్తున్నారు. అందులో అత్యధికంగా 30 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు. 12 రంగాల్లో దశల వారీగా విదేశీ వర్కర్లను ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 11 నుంచి కార్లు, మోటార్‌బైక్ షోరూమ్స్.. రెడీమేడ్ క్లోత్స్ స్టోర్స్, హోమ్ అండ్ ఆఫీస్ ఫర్నీచర్ స్టోర్స్, హోమ్ అప్లియెన్సెస్ స్టోర్స్‌లో విదేశీ వర్కర్లను తీసుకునే వీలుండదు. ఇక ఇదే ఏడాది నవంబర్ 9 నుంచి ఎలక్ట్రానిక్స్ స్టోర్స్, వాచెస్, క్లాక్ స్టోర్స్, ఆప్టిక్స్ స్టోర్స్‌లలో విదేశీ వర్కర్లను తీసుకోవద్దు. వచ్చే ఏడాది జనవరి 9 నుంచి మెడికల్ ఎక్విప్‌మెంట్, సైప్లెస్ స్టోర్స్, బిల్డింగ్ మెటీరియల్ స్టోర్స్, ఆటో స్పేర్ పార్ట్స్ స్టోర్స్, కార్పెట్ సెల్లింగ్ స్టోర్స్, స్వీట్ షాపుల్లో విదేశీ వర్కర్లకు ఇక అవకాశం ఉండదు.

గతేడాది సౌదీలో 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న యువతలో 32.6 శాతం మేర నిరుద్యోగం ఉన్నట్లు తేలింది. దీంతో సౌదీ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com