భాగస్వామిపై నిఘా: యూఏఈలో 36 శాతం

- February 06, 2018 , by Maagulf
భాగస్వామిపై నిఘా: యూఏఈలో 36 శాతం

యు.ఏ.ఈ:జీవిత భాగస్వామిపై నమ్మకం వుంటేనే వైవాహిక జీవితం ఆనందంగా కొనసాగుతుంది. కానీ ఇప్పుడు లెక్కలు మారాయి. ప్రతి వ్యక్తీ ప్రైవసీ కోరుకోవడం మామూలైపోయింది. ఈ డిజిటల్‌ ప్రపంచంలో స్నేహితులు, స్నేహితురాళ్ళ కారణంగా వైవాహిక బంధం తెగిపోకూడదని కోరుకునేవారు ఎక్కువగా ఈ ప్రైవసీని కోరుకుంటున్నారు. అదే చాలా సందర్భాల్లో వారి వైవాహిక బంధానికి ముప్పు కలిగిస్తోంది. కాస్పర్‌ స్కై సంస్థ నిర్వహించిన సర్వేలో తమ భాగస్వాములపై అనుమానంతో 'స్పై' చేస్తున్నట్లు 36 శాతం మంది ఒప్పుకున్నారు. 79 శాతం మంది 'ప్రైవసీ' అవసరం అనీ, భార్యా భర్తలిద్దరికీ ఇది వర్తిస్తుందనీ అన్నారు. చిత్రంగా 80 శాతం మంది ప్రైవసీ కంటే బంధాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. 62 శాతం మంది తమ పిన్‌ మరియు పాస్‌వర్డ్‌లను భాగస్వామికి ఇచ్చేందుకు వెనుకాడ్డంలేదు. ఆన్‌ లైన్‌ ద్వారా ఈ సర్వే జరిగింది. జీవిత భాగస్వామి పట్ల సంతోషం లేనివారే ఎక్కువమంది 'స్పై' చేస్తున్నట్లు తేలింది. పైకి నమ్మకం వుందంటూనే, ఆన్‌లైన్‌ ద్వారా చాటుమాటుగా తమ జీవిత భాగస్వామి ఎవరితో సోషల్‌గా మూవ్‌ అవుతోందో స్పై చేస్తున్నారు ఎక్కువమంది. కొన్నిసార్లు ఈ అనుమానాల కారణంగా పార్టనర్స్‌ మరింత ఎక్కువ ప్రైవసీని కోరుకుంటున్నారట. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com