రూ.15 లక్షల బంగారం స్వాధీనం: నటి శ్రుతి

- February 07, 2018 , by Maagulf
రూ.15 లక్షల బంగారం స్వాధీనం: నటి శ్రుతి

చెన్నై: నటి శ్రుతి నుంచి పోలీసులు రూ. 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కోవై, పాపనాయగన్‌పాలైయంకు చెందిన నటి శ్రుతి పెళ్లి పేరుతో పలువురు యువకులను మోసం చేసి లక్షల్లో డబ్బు, నగలను దోసుకున్న సంఘటన పెద్ద కలకాలాన్నే రేపింది. శ్రుతి వలలో పడి మోసపోయిన వారిలో వేలూరుకు చెందిన సంతోష్‌కుమార్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఒకరు.ఆయన చేసిన ఫిర్యాదు మేరకు వేలూరు పోలీసులు కేసు నమోదు చేసి శుత్రి సహా ఆమె తల్లి, సోదరుడు, బందువు అంటూ నలుగురిని అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.

కాగా ఇందులో భాగంగా శ్రుతి మోసం చేసి కొట్టేసిన డబ్బును, నగలను స్వాధీనం చేసుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందం మంగళవారం కోవై నుంచి చెన్నై వచ్చి, నటి శ్రుతికి ఖాతా ఉన్న బ్యాంకు లాకరులో రూ. 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని బుధవారం కోవైకి తీసుకొచ్చారు. ఆ నగలను కోర్టులో సమర్పించనున్నారు.  ఇంకా శ్రుతికి బ్యాంకు ఖాతాలేమైనా ఉన్నాయేమోనన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com