బన్నీ 'సూర్య'కు రెస్పాన్స్ సూపర్

- February 08, 2018 , by Maagulf
బన్నీ 'సూర్య'కు రెస్పాన్స్ సూపర్

బన్నీ 'సూర్య'కు రెస్పాన్స్ సూపర్ సూపర్ ఎనర్జిటిక్ హీరో బన్నీ. అతడి సినిమా వస్తుందంటే ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్. అదిరిపోయే స్టెప్పులు, అలరించే పాటలు. అభిమానులకు ఎనర్జీనిచ్చే ఓ మంచి టానిక్కులాంటి వాడు అల్లు అర్జున్. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా కోసం చాలా కష్టపడుతున్నాడు. ప్రేక్షకులు పట్టం కడతారని ఆశిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు మలయాళం, హిందీ, తమిళం, మరాఠి, బెంగాలీ, భోజ్ పురి భాషల్లో కూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలోని ఓ పాట అభిమానులను చాలా ఇంపాక్ట్ చేస్తోంది. అల్లు అర్జున్ పక్కన అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. మలయాళంలో ఈ చిత్రం పేరు 'ఎంటె పేరు సూర్య.. ఎంటె వీడు ఇండియా'గా తెరకెక్కుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com