2016 వేసవిలో '24' సినిమా
- November 25, 2015
ప్రిన్స్ మహేశ్ బాబు వదులుకున్న సినిమాను తమిళ హీరో సూర్య చేస్తున్నాడు. 'మనం' ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న '24' సినిమాలో సూర్య నటిస్తున్నాడు. ముందుగా ఈ కథను మహేశ్ కు విక్రమ్ కుమార్ వినిపించాడట. అతడికి ఫస్టాప్ బాగా నచ్చిందట. సెకండాఫ్ అంతగా ఆకట్టుకోలేకపోవడంతో ఈ సినిమా చేసేందుకు మహేశ్ ఆసక్తి చూపలేదట. తర్వాత ఈ సబ్జెక్ట్ సూర్యకు వద్దకు వెళ్లడం, అతడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న ఈ సినిమాలో మూడు పాత్రల్లో సూర్య కనిపించనున్నాడని సమాచారం. అన్నదమ్ములుగా, అన్న కొడుకుగా కనిపిస్తాడని తెలుస్తోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్ తో పాటు 2డి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై సూర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. 2016లో వేసవిలో '24' సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. మంగళవారం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆసక్తికరంగా ఉన్నాయి.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







