రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

- February 08, 2018 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

మనామా: సకిర్‌ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని పాకిస్తానీ జాతీయుడిగా గుర్తించారు. కింగ్‌డమ్‌లో విజిట్‌ కోసం వచ్చిన ఫజాన్‌ అనే వ్యక్తి, రాత్రి 7 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. క్యాంపింగ్‌ ఏరియాలో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని ఆసియాకి చెందిన జాతీయుడు మృతి చెందినట్లుగా మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ పేర్కొంది. ఈ ఘటన గురించి మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ సోషల్‌ మీడియా ద్వారా స్పందించింది. తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు మినిస్ట్రీ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com