ట్రంప్‌కు బడ్జెట్ విషయంలో భారీ షాక్..
- February 09, 2018అగ్రరాజ్య అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు భారీ షాక్ తగిలింది. అమెరికా మరోసారి షట్‌డౌన్ అయింది. దీంతో కీలకమైన బిల్లు అమెరికా సేనేట్‌లో వీగిపోయింది. షట్‌డౌన్ ప్రభావంతో ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. కీలకమైన బడ్జెట్‌కు ఆ దేశ కాంగ్రెస్ ఆమోదం లభించకపోవడంతో ఈ అర్థరాత్రినుంచి ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయనున్నారు. ఫెడరల్ ఫండింగ్ బిల్లు గత రాత్రితో ముగిసిపోయింది. అయితే కొత్త ద్రవ్యపరపతి బిల్లుకు ఆమోదం దక్కాల్సి ఉంది.కానీ బిల్లు వీగిపోయింది. ఇదిలావుంటే రోజుల వ్యవధిలోనే అమెరికా షట్‌డౌన్ అవ్వడంతో ప్రజలు షాక్ అవుతున్నారు. 20 రోజుల కిందట కొత్త బడ్జెట్ ప్రతిపాదనపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో సేనేట్ ద్రవ్య వినమయ బిల్లుకు ఆమోదం తెలుపలేదు. ఆ కారణంగా ఫెడరల్ ఆఫీసులన్నీ మూసివేతకు గురయ్యాయి. అనేక కీలక అంశాలపై డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఇంకా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రభుత్వానికి చేయూతనిచ్చే నిధులకు సంబంధించిన బిల్లుకు డెమోక్రాట్లు అడ్డుతగిలారు. దాంతో కీలక బిల్లులు ఆగిపోయి ప్రభుత్వం షట్‌డౌన్ అయింది.. ఇప్పుడు కూడా సేనేట్ సభ్యుల మద్దతు లేక బడ్జెట్ బిల్లు వీగిపోయింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రత్యామ్నాయాలపై ద్రుష్టి సారించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ