నెల క్రితం తప్పిపోయిన యువతుల ఆచూకీ లభ్యం
- February 09, 2018
కువైట్:ఒక నెల క్రితం వారి కుటుంబాల నుంచి పారిపోయినట్లుగా పిర్యాదు చేయబడిన కువైట్ దేశస్థులు కాని ఇరువురు సోదరీమణుల ఆచూకీ అనూహ్యంగా లభ్యమైంది. వీరిని రాజధాని అపరాధ పరిశోధకులు గురువారం అరెస్టు చేశారు. రాత్రిపూట ఆలస్యంగా నగరంలో సంచరిస్తూ పోలీసులకు వీరిద్దరూ ఎదురుపడ్డారు. వీరి కదలికలపై అనుమానం కల్గి పోలీసులు గుర్తింపు కార్డుల గూర్చి అడగ్గా అటువంటివి తమ వద్ద లేవని వారు స్పష్టం చేశారు.సెక్యూరిటీ వర్గాలు వారి వేలిముద్రలు తనిఖీ చేసినపుడు డిటెక్టివ్ లు ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లను గుర్తించారు. వారు జహ్రా లోని తమ కుటుంబంను వదిలి పారిపోయిన సోదరీమణులని నివేదించబడింది. తదుపరి పరిశోధనలు నిమిత్తం ఆ ఇద్దరినీ వహా పోలీసు స్టేషన్ కు తరలించారు.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయంలో రూ.14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
- ఓటమి పై యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం ఏమన్నారంటే?
- హైదరాబాద్ లో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే రూట్ ఖరారు
- షేక్ జాయెద్ రోడ్డులో మోటార్ సైక్లిస్ట్ మృతి..!!
- ముబారకియా మార్కెట్ కోసం ఏసీ వాక్వేలు..!!
- అమీర్, యూఏఈ ప్రెసిడెంట్ భేటీ..!!
- ఇరాన్-IAEA ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- ఉద్యోగిని కొట్టిచంపిన వ్యక్తికి జీవితఖైదు..!!
- పిల్లలు, యువతపై వాతావరణ మార్పుల ప్రభావంపై అధ్యయనం..!!
- యూఏఈ పై భారత్ ఘన విజయం