ఫ్రాన్స్ లో ఈఫిల్ టవర్ మూసివేత!
- February 09, 2018ఫ్రాన్స్:ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్ మంగళవారం మూతపడింది. ప్రతిరోజు వేలమంది సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. గతేడాది 70 లక్షలకు పైగా పర్యాటకులు ఈ అద్భుతాన్ని సందర్శించగా ఇందులో 80 శాతానికి పైగా విదేశీయులు ఉన్నారు. అయితే ఫ్రాన్స్ కార్మిక చట్టాలు తమకు అడ్డుగా నిలుస్తున్నాయని, దీంతో తాము అధిక ఒత్తిడికి గురవుతున్నాయని కార్మికులు ధర్నా చేశారు. ఈ కారణంగా ఈఫిల్ టవర్ ను మంగళవారం మూసివేసినట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈఫిల్ టవర్ కు వచ్చే సందర్శకులను రిసీవ్ చేసుకోవడం, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, టవర్ వద్ద పనిచేయడం, మొదలైన పనులు నిర్వహించడం తమకు చాలా కష్టమవుతుందని ధర్నా చేస్తున్నారు. ప్రతిరోజూ 15 నుంచి 20 వేల మంది ఇక్కడకి వస్తుంటారని, తగిన స్టాప్ లేకపోవడంతో ఒక కార్మికుడు రెండు, మూడు డిపార్ట్ మెంట్స్ పనులు నిర్వహించాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాల కారణంగానే నిరుద్యోగిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని కార్మికులు వాపోయారు. వర్కర్స్ ఎవరూ రాకపోవడంతో ఈఫిల్ టవర్ ను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?