ఒమాన్ లో గృహ సహాయ సంస్థ ఉద్యోగికి జరిమానా ...జైలుశిక్ష
- February 09, 2018
మస్కట్: ఒక క్లయింట్ కు చెల్లించాల్సిన డబ్బుని తిరిగి చెల్లించటానికి నిరాకరించిన దేశీయ కార్మికుల రిక్రూట్మెంట్ ఏజెన్సీకి చెందిన ఒక ఉద్యోగికి 1,300 ఒమాన్ రియళ్ళ జరిమానా మరియు జైలుశిక్ష విధించబడింది. పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్టు ప్రచురించిన నివేదిక ప్రకారం ఇటీవల సుర్ వినియోగదారుల రక్షణ చట్టం ఉల్లంఘించిన ఆరోపణలపై ఆ ఉద్యోగిపై ఒక తీర్పు జారీ చేసింది. రిక్రూట్మెంట్ ఏజెన్సీకు వ్యతిరేకంగా ఒక వినియోగదారుడు చేసిన ఫిర్యాదు మేరకు కార్మికునికి సరైన సేవను అందించడంలో తమ బాధ్యత ఉల్లంఘన చేసిన నేపథ్యంలో ఈ పిర్యాదు దాఖలు చేశారు. 1,300 ఒమాన్ రియళ్లను చెల్లించి గృహ సహాయాన్ని తీసుకోవాలని వినియోగదారుడు యజమానిని సంప్రదించారు. ఒక వారం తరువాత పనిమనిషి తో పని చేయించుకోవడానికి నిరాకరించాడు, అందుచే అతను తనను వేరేచోట ఉద్యోగిగా భర్తీ చేయాల్సిందిగా కోరాడు. ఆ విధంగానూ వేరే ఉద్యోగం చూపటంలో విఫలమయ్యారు. దీంతో వినియోగదారుడు చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని ఒక అభ్యర్థన సైతం దాఖలు చేశాడు, కానీ ఆ కార్యాలయం అతని వాదనలకు ఏమాత్రం స్పందించలేదు, దీంతో ఆ వ్యక్తి వినియోగదారుని సంరక్షణ పబ్లిక్ అథారిటీకి ఫిర్యాదు చేశాడు. పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ సంబంధిత ఉద్యోగిపై అవసరమైన చర్య తీసుకుంది.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







