దుబాయ్ లో భారత త్రివర్ణ పతాక సందడి
- February 10, 2018దుబాయ్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం సాయంత్రం అబుదాబి చేరుకోనుండగా, ఆయనకు ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జయీద్ అల్ నెహ్యాన్ ఘనంగా స్వాగతం పలకనున్నట్లు యుఎఇ భారత రాయబారి తెలిపారు. ఇరు దేశాల నేతలు పలు ద్వైపాక్షిక అంశాల గురించి చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం దుబాయ్‌లో నిర్వహిస్తున్న ప్రపంచ ప్రభుత్వ సమ్మిట్‌కు యుఎఇ నేతలతో కలిసి మోడీ హాజరై ప్రసంగించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో భారత్ ఆతిథ్య దేశంగా పాల్గొననుండగా దుబాయ్‌లోని ప్రఖ్యాత ప్రాంతాలన్నీ భారతీయ జెండా రంగులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతి బుర్జ్ ఖలీఫా, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెని, ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిక్చర్ ఫ్రేమ్ 'దుబారు ఫ్రేమ్'లు భారతీయ జెండా రంగులతో వెలిగిపోతూ కనువిందు చేస్తున్నాయని, ఈ ఫొటోలను యుఎఇ భారత రాయబారి ట్విటర్ ద్వారా పోస్టు చేశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి