భాగ్యనగరంలో 'సోఫియా'

- February 10, 2018 , by Maagulf
భాగ్యనగరంలో 'సోఫియా'

హైదరాబాద్‌: మానవరూప రోబో సోఫియా భారత్‌కు రెండోసారి రాబోతున్నది. దేశంలో మొదటిసారిగా హైదరాబాద్‌లో జరగనున్న వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(డబ్ల్యూసీఐటీ)కి సోఫియా రానున్న ది. ఈ నెల 19నుంచి 21వరకు జరగనున్న ఈ కార్యక్రమానికి పుల్లెల గోపీచంద్‌, జగ్గీ వాసుదేవ్‌, పీడబ్ల్యూసీ ఇండియా చైర్మెన్‌ శ్యామల్‌ ముఖర్జీ, అడాబ్‌ సిస్టమ్‌ సీఈవో శాంతాను నారాయణ్‌ హాజరుకానున్నారు. దాదాపు 150మంది అంతర్జా తీయ నాయకులు ఇందులో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమానికి సోఫియా హాజరై ప్రసంగించనున్నదని డబ్ల్యూసీఐటీ హైదరాబాద్‌ అంబాసి డర్‌ సుమన్‌ రెడ్డి తెలిపారు. ఈ రోబో సృష్టికర్తలూ హాజరు కానున్నారని వెల్లడించారు. సౌదీ అరేబియా పౌరసత్వాన్ని పొందిన ఈ రోబోను హాంగ్‌కాంగ్‌లోని హాన్సన్‌ రోబోటిక్స్‌ రూపొందించింది. కెమెరాలు, మైక్రోఫోన్‌లను అమర్చిన ఈ రోబో కండ్లతో గుర్తించి మాట్లాడగలిగే కృత్రిమ మేధా(ఏఐ) సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తుంది. సంతోషాన్ని వ్యక్తపరిచే భావోద్వేగాన్ని మాత్రమే సోఫియా కలిగి ఉన్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com