పెళ్లికోసం కల్యాణ మండపాన్ని బుక్ చేసుకున్న విశాల్!

- February 10, 2018 , by Maagulf
పెళ్లికోసం కల్యాణ మండపాన్ని బుక్ చేసుకున్న విశాల్!

తెలుగులో పుట్టి తమిళ సినీ పరిశ్రమలో రాణిస్తున్న పందెంకోడి విశాల్ రెడ్డి, త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించాడు. అయితే పెళ్లి త్వరలో అంటే రెండు మూడు నెలలు , వారాలు కాదు ఏకంగా జనవరిలో. అంటే ఇంకా ఇంచుమించు సంవత్సర కాలం ఉంది. విశాల్ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు ఈ సందర్బంగా తన పెళ్లిపై స్పందించారు. నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణం వేగంగా జరుగుతోందని, డిసెంబర్‌ నాటికి పూర్తి అవుతుందని, జనవరిలో ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపాడు. సంఘం సొంత భవనంలో జరగనున్నమొదటి వివాహం తనదే అవుతుందని, అందుకే మండపాన్ని అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నానని అన్నారు. కానీ పెళ్లి కూతురు ఎవరనేది మాత్రం విశాల్ చెప్పకపోవడం గమనార్హం. ఇదిలావుంటే గతంలో నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి, విశాల్ పై మనసుపారేసుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com