అఖిల్ సినిమాని నిర్మిస్తున్న రానా
- February 10, 2018
బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్‌గా పాపులర్ అందుకున్న రానా ప్రస్తుతం బహుబాషా నటుడిగా వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు. నిర్మాతగాను అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. రీసెంట్గా సురేష్ మూవీ ప్రొడక్షన్స్‌లో ఓ సినిమాను నిర్మించాడు రానా. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో శీరత్ కపూర్, శ్రద్ధ శ్రీనాథ్, షాలినీ హీరోయిన్లుగా నటించారు. క్షణం సినిమాతో మంచి హిట్ కొట్టిన డైరెక్టర్ రవికాంత్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది. గుంటూరు టాకీస్ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాలో హీరోగా నటించాడు. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అక్కినేని మూడోతరం వారసుడు అఖిల్ ఇటీవల హలో సినిమాతో అలరించాడు. సినిమా హిట్ టాక్ సాధించినప్పటికి కలెక్షన్స్ విషయంలో కాస్త డల్‌గానే సాగింది. ఈ నేపథ్యంలో తన మూడో సినిమాని రంగస్థలం డైరెక్టర్ సుకుమార్‌తో చేయాలని భావిస్తున్నాడట. నాలుగో సినిమాని తమిళ దర్శకుడు సత్య పినిశెట్టి తెరకెక్కించనున్నట్టు టాక్. ఈ రెండు సినిమాలని రానా తన ప్రొడక్షన్లో నిర్మించాలని భావిస్తున్నట్టు టాక్. తన తండ్రి సురేష్ బాబుతో చర్చలు జరిపిన తర్వాత రానా దీనిపై పూర్తి నిర్ణయానికి వస్తాడట .
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి