రష్యాలో కుప్పకూలిన విమానం...

- February 11, 2018 , by Maagulf
రష్యాలో కుప్పకూలిన విమానం...

రష్యా:71మంది ప్రయాణీకులు, సిబ్బందితో మాస్కో నుంచి బయల్దేరిన రష్యా విమానం కూలిపోయింది.

మాస్కో నుంచి ఆర్స్క్ నగరానికి పయనమైన ఈ విమానం రాడార్ తెరలపై నుంచి కనుమరుగైన కాసేపటికే కూలిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది.

సారటోవ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం కూలిపోయినట్లు, ఇందులో ప్రయాణిస్తున్న 71మంది బతికి బయటపడే అవకాశం లేనట్లు ఎమర్జెన్సీ సర్వీసెస్‌ సోర్స్ ఇంటర్‌ఫాక్స్ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు.

మాస్కోకు 80కి.మీ దూరంలోని ఆర్గునోవో ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.డొమోడెడోవో విమానాశ్రయం నుంచి బయల్దేరిన రెండు నిమిషాల్లోనే విమానం రాడార్ తెరలమీద నుంచి అదృశ్యమైందని మరో న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com