దుబాయ్ ఓపెరా లో ప్రవాస భారతీయుల్ని ఉద్దేశించి ప్రసంగించిన మోడీ
- February 11, 2018
దుబాయ్:భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన దుబాయ్కు చేరుకున్నారు. ముందు ఆయన అరబ్ దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు నివాళులర్పించారు. ఓపెరా హౌస్‌కు చేరుకున్న అనంతరం ప్రవాస భారతీయుల్ని ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. అరబ్, భారత్‌కు మధ్య ఉన్న సంబంధం వ్యాపార సంబంధం కాదని, ఇదొక భాగస్వామ్యమని పేర్కొన్నారు. భారత్ నుండి వచ్చి గల్ఫ్‌లో స్థిరపడిన 30 లక్షల మందికి తమ మాతృభూమి వాతావరణాన్ని కల్పించారని, దీనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. ప్రపంచంలోనే భారత్ తన ఖ్యాతిని ఇనుమడింపజేస్తోందన్నారు. ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నందుకు 125 కోట్ల భారత ప్రజల తరఫున తాను క్రౌన్ ప్రిన్స్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాని, దీని నిర్మాణంతో ప్రపంచ ప్రజలకు వసుదైక కుటుంబం అనే సందేశాన్నిచ్చినట్లవుతుందని పేర్కొన్నారు.
ప్రపంచ బ్యాంకు ఇచ్చే ర్యాంకుల్లో భారత్ 142నుండి 100కు చేరుకుందని, మరింత మెరుగుపడేందుకు కృషిచేస్తామన్నారు.
తాజా వార్తలు
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం







