రోబోటిక్‌ ఫెస్టివల్‌ నిర్వహించనున్న బహ్రెయిన్‌

- February 11, 2018 , by Maagulf
రోబోటిక్‌ ఫెస్టివల్‌ నిర్వహించనున్న బహ్రెయిన్‌

మనామా: సుప్రీం కౌన్సిల్‌ ఫర్‌ యూత్‌ అండ్‌ స్పోర్ట్స్‌ (ఎస్‌సివైఎస్‌) తొలి డిప్యూటీ ఛైర్మన్‌ మరియు బహ్రెయిన్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ (బిఎఎ) ఛైర్మన్‌ షేక్‌ ఖలీద్‌ బిన్‌ హమాద్‌ అల్‌ ఖలీఫా, బహ్రెయిన్‌ రోబోటిక్‌ ఫెస్టివల్‌ 2018కి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫెస్టివల్‌లో బహ్రెయిన్‌ విఇఎక్స్‌ కాంపిటీషన్‌ కూడా జరగనుంది. వరల్డ్‌ రోబోట్‌ ఒలింపియాడ్‌ (డబ్ల్యుఆర్‌ఓ ఎల్‌ఇజి) కూడా ఈ ఫెస్టివల్‌లో జరగనుంది. మోడ్రన్‌ టెక్నాలజీని యువత అందిపుచ్చుకోవడంతోపాటు, సరికొత్త ఆవిష్కరణలకు వేదికగా ఈ కార్యక్రమం జరగబోతోందని షేక్‌ ఖాలిద్‌ బిన్‌ హమాద్‌ అల్‌ ఖలీఫా చెప్పారు. ఇంటర్‌డిసిప్లినరీ మరియు అప్లయ్డ్‌ అప్రోచ్‌ - సైన్స్‌, టెకానలజీ, ఇంజనీరింగ్‌ మరియు మేథమెటిక్స్‌ (ఎస్‌టిఇఎం)ని బేస్‌ చేసుకుని ఈ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com