ఘాజీ ఇచ్చిన బూస్ట్‌తో డైరెక్టర్ సంకల్ప్ స్పేస్ ఫిల్మ్ వరుణ్ తేజ్ తో
- February 12, 2018
ఫిదా, తొలిప్రేమ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడంలో మెగా హీరో వరుణ్‌తేజ్ ఫుల్‌జోష్‌లో వున్నాడు. ఇదే ఊపు లో మరో కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడు. సక్సెస్‌ఫుల్ ఎక్స్‌పరిమెంటల్ మూవీ 'ఘాజీ'ని తీసిన డైరెక్టర్ సంకల్ప్‌రెడ్డితో వరుణ్ తేజ్ జట్టుకట్టనున్నాడు. అంతరిక్ష నేపథ్యంలో రూపొందనున్న సంకల్ప్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో వరుణ్ వ్యోమగామిగా నటిస్తున్నట్లు టాక్. ఇప్పటికే చర్చలు కూడా ఐపోయాయని, ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో సెట్స్‌పైకి వెళ్లేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం.
ఘాజీ తరహాలోనే సెట్స్ మీదనే కాకుండా రియలిస్ట్ వాతావరణంలో చేయాలన్నది మేకర్స్ థాట్. జార్జియాలో జీరో గ్రావిటీ కండిషన్స్‌తో ప్రత్యేక సెట్ రూపొందించి కొంతషూట్ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం డైరెక్టర్, హీరో కజికిస్థాన్‌లో స్పెషల్‌గా ట్రైనింగ్ తీసుకోనున్నారు. మొత్తానికి ఘాజీ ఇచ్చిన బూస్ట్‌తో సంకల్ప్ స్పేస్ ప్రాజెక్ట్‌ని డిజైన్ చేసుకున్నాడు. దీనికి వరుణ్ పర్ఫార్మెన్స్ అడిషనల్ క్లాలిటీ కానుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి