ఒమన్ లో మోదీ ఏం చేశారు ?
- February 12, 2018
ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ సోమవారం ఓల్డ్ మస్కట్ లోని 125 ఏళ్ళ చరిత్ర గల శివాలయాన్ని సందర్శించి పూజలు చేశారు. గుజరాత్ కు చెందిన కొందరు వ్యాపారులు దాదాపు 125 సంవత్సరాల క్రితం ఒమన్ వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతున్నారు.
ఆ తర్వాత 1999 లో ఈ గుడిని పునరుద్ధరించారు. కాగా-మస్కట్ లో మూడు లక్షల టన్నుల భారతీయ ఇసుకరాయితో నిర్మించిన సుల్తాన్ ఖబూస్ గ్రాండ్ మసీదును మోదీ విజిట్ చేశారు. అనంతరం ఇదే పేరిట నిర్మించిన స్టేడియం వద్దకు చేరిన సుమారు 20 వేలమంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు." కనీస ప్రభుత్వం "( మినిమం గవర్నమెంట్), " గరిష్ట పాలన " (మాగ్జిమం గవర్నెన్స్) అనే " మంత్రాన్ని " తాము జపిస్తున్నామని, సాధారణ ప్రజల జేవితాలు బాధల్లేకుండా కొనసాగాలన్నదే దీని ఉద్దేశమని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇండియాలో చేపట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును గురించి ఆయన ప్రస్తావించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







