కువైట్ లో తమకు భద్రత లేదని స్వదేశానికి వెళ్లిపోతున్న ఫిలిప్పైన్స్ ప్రవాసీయులు
- February 12, 2018_1518442912.jpg)
కువైట్: ' ఏమున్నదక్కో ఏమున్నదక్కా ముల్లె సదురుకున్న మూటా సదురుకున్న ఎల్లిపోతావున్న ఈ ఊల్లొ నాకింక ఏమున్నదక్క... ఏమున్నదక్కో...ఏమున్నదక్కా. ' అంటూ కువైట్ నుంచి స్వదేశం వెళ్లిపోయేందుకు పలువురు ఫిలిప్పీన్ దేశస్థులు పెద్ద ఎత్తున సిద్ధమయ్యారు. ఫిలిప్పైన్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్ట్ హామీని నమ్ముకొని ఆ దేశ పౌరులు సిద్ధమయ్యారు. సుమారు 2,200 మంది ప్రవాసీయులు స్వేదేశానికి వెళ్లేందుకు సమాయత్తమయ్యారు. ఫిలిప్పైన్స్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాల్లో వీరు తమ సొంత ప్రాంతాలకు చేరుకోనున్నారు. ఇటీవల కాలంలో కువైట్‌లో పనిచేస్తున్న ఫిలిప్పీనీయులపై దాడులు పెచ్చురిల్లుతున్నాయని,ముఖ్యంగా మహిళలపై వేధింపులు అధికమవడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, మరికొందరు దారుణ హత్యలకు గురవుతున్నారని ఆందోళన చెందుతున్నారు. మిగిలినవారైనా ఇక ఆలస్యం చేయకుండా స్వదేశానికి తిరిగొచ్చేయాలని అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్ట్ తమ పౌరులకు గత నెలలో పిలుపునిచ్చారు. గతవారం ఫిలిప్పైన్స్కు చెందిన ఓ వ్యక్తిని దుండగులు హత్య చేశారు. అనంతరం మృతదేశాన్ని ఓ ఫ్రీజ్‌లో ఉంచారు. కొద్దిరోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతంపై స్పందించిన ఫిలిప్పైన్స్ ప్రభుత్వం స్వదేశానికి తిరిగొచ్చేయాలంటూ పౌరులకు సూచించింది. దీంతో కొందరు పౌరులు ఫిలిప్పైన్స్ తిరిగి వెళ్లేందుకు ఇదిలావుండగా కువైట్ ప్రభుత్వ వాదన మరోలా ఉంది. ఫిలిప్పైన్స్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విస్మయానికి గురిచేస్తోందని అధికారులు ప్రకటించారు. కువైట్ లో దాదాపు 2 లక్షల యాభై వేలమందికి పైగా ఫిలిప్పైన్స్ ప్రవాసీయులు కువైట్‌లో వివిధ ఉద్యోగాలలో ఉన్నారని, అత్యధికులు కార్మికులుగానే పనిచేస్తున్నారని, ఫిలిప్పైన్స్ కు తిరిగివచ్చిన తమ పౌరులకు స్వదేశంలోనే ఉపాధిని కల్పించనున్నామని ఫిలిప్పైన్స్ మంత్రి ఇటీవల హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి