శివరాత్రి సందర్భంగా కోయంబత్తూరులోని ఇషా యోగా కేంద్రంలో జాగరణోత్సవం

- February 13, 2018 , by Maagulf
శివరాత్రి సందర్భంగా కోయంబత్తూరులోని ఇషా యోగా కేంద్రంలో జాగరణోత్సవం

కోయంబత్తూరు శివనామ స్మరణతో మార్మోగింది. వేలమంది భక్తులు భోళాశంకరుడి సేవలో పునీతులయ్యారు. ఇషా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా జాగరణోత్సవం నిర్వహించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము దాకా ఏకధాటిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి వేలసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

శివరాత్రి సందర్భంగా కోయంబత్తూరులోని ఇషా యోగా కేంద్రంలో జాగరణోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో సద్గురు జగ్గీ వాసుదేవ్‌ భక్తులకు ప్రవచనాలు అందించారు. ఈ వేడుకలకు వేలమంది భక్తులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. పలువురు సినీ తారలు, పొలిటికల్‌ లీడర్లు జాగరణలో పాల్గొన్నారు.
.
జాగరణోత్సవంలో భాగంగా ఇషా యోగా కేంద్రంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. సోనూ నిగమ్‌, దలేర్‌ మెహందీలు నిర్వహించిన సంగీత విభావరితో భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com