యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'సాక్ష్యం' ఫస్ట్ లుక్

- February 14, 2018 , by Maagulf
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'సాక్ష్యం' ఫస్ట్ లుక్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'జయ జానకి నాయక' చిత్రంతో నిలదొక్కుకున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా నటిస్తున్న మూవీ సాక్ష్యం. ఈ మూవీకి శ్రీవాస్ దర్శకుడు.. పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ వారణాసి, దుబాయ్ లలో జరిగింది.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. శ్రీను, పూజా హెగ్డ్ లు హగ్ చేసుకుంటూ ఒకరినొకరు తన్మయంగా చూసుకుంటున్న ఫోటోను పోస్టర్ లో ముద్రించారు.. ఈ పోస్టర్ కు నేచుర్ ఈజ్ ద విట్ నెస్ అంటూ క్యాప్షన్ ఉంచారు.. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, వెన్నెల కిశోర్, శరత్ కుమార్, మీనాలు పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.వచ్చే నెలలో ఈ మూవీ రిలీజ్ కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com