రెడీ మిక్సింగ్ సిమెంట్ ట్యాంకర్‌లో దాగి 22 మంది షార్జా లోనికి అక్రమ ప్రవేశించేందుకు యత్నం

- February 14, 2018 , by Maagulf
రెడీ మిక్సింగ్ సిమెంట్ ట్యాంకర్‌లో దాగి 22 మంది షార్జా లోనికి అక్రమ ప్రవేశించేందుకు యత్నం

షార్జా : ' మేడి పండు చూడ ...మేలిమై ఉండు...పొట్ట విప్పి చూడ పురుగులుండు '  అన్న తరహాలో ఓ    సిమెంట్ మిక్సింగ్ ట్యాంకర్‌ లోపల 22 మంది దాక్కొని షార్జా లోనికి అక్రమ ప్రవేశించేందుకు విఫలయత్నం చేశారు. ఎందుకైనా మంచిది ఓసారి లోపల ఏమి చూద్దామనుకొన్న పోలీస్ అధికారులు  ఎక్స్‌రే స్కానర్‌తో క్షుణంగా పరిశీలించిన వారికి దిమ్మతిరిగిపోయింది. లోపల ట్యాంకర్‌లో 22 మంది బుద్ధిగా కూర్చొని  ఉన్నారు. పాస్పోర్ట్ ..వీసాలు ఎటువంటి అనుమతిపత్రాలు లేకుండా ఇలా రహస్యంగా అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్న ట్యాంకర్‌లోని 22 మందిని  డ్రైవర్‌‌తోసహా పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానంగా ఓ ట్యాంకర్ లో కొందరిని సరిహద్దు దాటించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని యూఏఈ ఫెడరల్ కస్టమ్స్ అథారిటీ(ఎఫ్‌సీఏ), డిపార్ట్‌‌మెంట్ ఆఫ్ సీపోర్ట్ అండ్ కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దీనితో అప్రమత్తమైన అధికారులు సరిహద్దులో గస్తీలు తనిఖీలు పెద్ద ఎత్తున నిర్వహించారు.అరెస్ట్ కాబడిన అక్రమ ప్రవేశించిన రహస్య దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. షార్జా చట్టం ప్రకారం వీరందరికి కఠిన శిక్షలు విధించనున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com