టెన్త్ పాసైన నిరుద్యోగులకు శుభవార్త...ఏపీ పోస్టల్ రిక్రూట్మెంట్ 2018
- February 15, 2018
పదవ తరగతి పాస్ అయినవారు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలకు అర్హులు.. ఇప్పటికే నావీ సంస్థ ఉద్యోగాలకోసం అప్లికేషన్ ను రిలీజ్ చేయగా... ఇప్పుడు ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ నిరుద్యోగులకు శుభవార్త ను వినిపించింది. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ లో 245 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వీటిలో 234 పోస్ట్ మ్యాన్, 11 మెయిల్ గార్డ్ ల పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను రాత పరీక్షలను నిర్వహించి భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారు రూ.21,700 జీతంగా పొందుతారు.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు మార్చి 15 లోగా ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.. మార్చి 16 లోగా పోస్టాఫీస్ లో రూ.500 లు దరఖాస్తు ఫీజుగా చెల్లించి మార్చి 20 లోగా ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది..
వయసు: 18 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితుల్లో సడలింపు ఉంటుంది.
పరీక్షా విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. పదోతరగతి స్థాయిలోనే ప్రశ్నపత్రాలను రూపొందిస్తారు. రాతపరీక్షలో జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, తెలుగు విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 25 మార్కులు కేటాయిస్తారు.
రాతపరీక్ష తేదీని.. ఏపీ పోస్టల్ వెబ్సైట్ ద్వారా ప్రకటిస్తారు.
పోస్ట్ మ్యాన్ పోస్టులకు ఖాళీలు: విజయవాడ పరిధిలో 106, కర్నూలు పరిధిలో 60, విశాఖ పట్నం 68
మెయిల్‌గార్డు పోస్టులకు : విజయవాడ పరిధిలో 6, కర్నూలు పరిధిలో 2, విశాఖ పట్నం పరిధిలో 3 ఖాళీలు ఉన్నాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి