సౌదీ ఎడారిలో అరుదైన ఒంటె ఫోటోలు
- February 15, 2018
రియాద్: దాదాపు 2 వేల ఏళ్ల క్రితం రాతిపై చిత్రించిన అరుదైన ఒంటె చిత్రాలను సౌదీ అరేబియా ఎడారిలో ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు. రెండు వేల ఏళ్ళ క్రితం నాటి భారీ ఒంటె చిత్రాన్ని పరిశోధకులు కనుగొన్నారు.
వాస్తవానికి సౌదీ అరేబియాలో ఇలాంటి చిత్రాలు లభ్యకావడం కొత్తేమీ కాదని చరిత్ర పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఒకే ప్రాంతంలో దాదాపు 12 ఒంటెల చిత్రాలు ఉన్నాయని, ఇలా ఒకే చోట ఇన్ని చిత్రాలు ఉండటం అరుదని చెప్పారు.
కొన్ని చిత్రాలను పూర్తిగా చెక్కకుండా ఉన్నాయని పరిశోధకులు చెప్పారు.. బహుశా ఈ ప్రదేశం నుంచి ప్రార్థనలు చేయడం వల్ల ఈ చిత్రాలను చెక్కి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
అరేబియన్ రాక్ ఆర్ట్‌లో పెయింటింగ్, శిలలపై చెక్కడానికి చాలా ప్రాధాన్యత ఉందని తెలిపారు. ముఖ్యంగా యుద్ధం, వేట, జంతువులకు సంబంధించిన బొమ్మలను రాక్ ఆర్ట్‌లో భాగంగా పూర్వకాలపు అరేబియన్లు చిత్రించేవారని వివరించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి