చాకచక్యంగా పిల్లల్ని కాపాడిన..భారతీయ సంతతి మహిళ

- February 16, 2018 , by Maagulf
చాకచక్యంగా పిల్లల్ని కాపాడిన..భారతీయ సంతతి మహిళ

న్యూయార్క్‌ : అమెరికాలోని ఫ్లోరిడాలో అత్యంత పాశవికంగా మాజీ విద్యార్థి కాల్పుల సమయంలో శాంతి విశ్వనాథన్‌ అనే గణిత ఉపాధ్యాయురాలు చాకచక్యతను ప్రదర్శించి అనేక మంది పిల్లల ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళితే బుధవారం మధ్యాహ్నం పాఠశాల్లోని అలరామ్‌ రెండోసారి మోగిన వెంటనే కాల్పుల శబ్దం విన్న శాంతి తను బోధిస్తున్న తరగతి గది తలుపులను మూసివేశారు. వెంటనే పిల్లలందరినీ నేలపై పడుకోమని చెప్పి, కిటికీలను కూడా మూసివేసింది. ఇలా చేయడం వల్ల నిందితునికి అది ఖాళీ క్లాస్‌ రూంలా తోచి ఏమీ చేయకుండా వెళ్లిపోతాడన్న ఆలోచనతో ఆవిధంగా చేసిందని సన్‌ సెన్‌టైల్‌ పేర్కొన్నారు. ఆ తర్వాత పోలీసులు వచ్చి తలుపు తీయమన్నా తీయలేదని, తాను పోలీసునని చెప్పుకొని తలుపులు తీయించేందుకు ఉన్మాదినే ఈ విధంగా ట్రిక్స్‌ చేస్తున్నాడని భావించి తలుపు తీయలేదని పత్రిక పేర్కొంది. తలుపు బద్దలు కొట్టుకోండి లేదా కీ తో తలుపును తీసుకోండి, తాను మాత్రం తలుపు తీయనని తెలిపిందని పత్రిక వెల్లడించింది. ఆ తర్వాత పోలీసులు కిటికీలు ఓపెన్‌ చేయగా, పోలీసులని నిర్ధారించుకుని పిల్లలను బయటకు పంపించారు. ఆమె త్వరగా స్పందించి, చాలా మంది ప్రాణాలను కాపాడిందని ఒక విద్యార్థి తల్లి పత్రికా విలేకరులతో పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com