ప్రేక్షకుల ఫుల్ కామిడి తో వస్తున్నా 'సోడా.. గోలీ సోడా' మూవీ రివ్యూ
- February 17, 2018
ప్రేక్షకుల వినోద దాహర్తి తీర్చే సోడా.. గోలీ సోడా మూవీ రివ్యూ
నటినటుల - మానస్, నిత్యా నరేష్, కారుణ్య, బ్రహ్మనందం, అలీ, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, హైపర్ ఆది, కృష్ణ భగవాన్ తదితరులు
సినిమాటోగ్రఫీ - ముజీర్ మాలిక్
సంగీతం - భరత్
దర్శకత్వం - మల్లూరి హరిబాబు
నిర్మాత - భువనగిరి సత్య సింధూజ
బ్యానర్ - ఎస్ బి క్రియేషన్స్
విడుదల తేది - 15.02.2017
నిడివి - 143 నిమిషాలు
సోడా.. గోలీ సోడా.. టైటిల్ తోనే అంచనాలు పెంచుకున్న మూవీ ఇది.ఇక విడుదలైన ట్రైలర్ తో ఇందులో ఏదో మెస్సెజ్ ఉందనే భావం కూడా వ్యక్తంమైంది.మల్లూరి హరిబాబు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ శుక్రవారం విడుదలైంది..ఎస్.బి క్రియేషన్స్ పతాకంపై చక్రసీద్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి నిర్మాత భువనగిరి సత్య సింధూజ, . మానస్, నిత్య నరేష్, కారుణ్య హీరో హీరోయిన్స్ గా నటించారు. మరి సోడా..గోలీ సోడా టైటిల్ తగ్గట్టుగానే ప్రేక్షకుల వినోద దాహర్తిని తీర్చిందే లేదో తెలుసుకోవాటంటే ఈ మూవీ చూడాల్సిందే..
కథ:
తన ఊరిలో ఓ గ్యాంగ్ ను వేసుకొని దొంగతనాలు చేసుకుంటూ బ్రతుకుతున్న కుర్రాడు శీను(మానస్) ఈ శీను పేర్వారం గ్రామ ప్రెసిడెంట్ కూతురు రూప (నిత్యా నరేష్)ను ప్రేమిస్తాడు. రూపకు కూడా శీను అంటే చాలా ఇష్టం పడటం తో ప్రెసిడెంట్ కూడా వారి పెళ్లికి ఒప్పుకుంటాడు. కానీ తమ పెళ్లి జరగాలంటే ఓ కండీషన్ పెడుతుంది రూప. ఆ కండీషన్ ప్రకారమే హైదారాబాద్ వెళ్లి హీరో అవ్వాలనుకుంటాడు. అనుకున్నట్టుగానే ఓ సినిమాకు హీరో అయ్యి నిర్మాతగా కూడా వ్యవహరిస్తుంటాడు. అయితే ఆ సినిమా సగంలోనే ఆగిపోతుంది. ఇంతకూ దొంగ శీనును ప్రెసిడెంట్ కూతురు ఎందుకు ప్రేమించింది. పెళ్లికి ఏం కండీషన్ లో విజయం సాధించాడా.. దొంగ శీను హైదరాబాద్ వచ్చి హీరో ఎలా అయ్యాడు. నిర్మాతగా ఎలా మారాడు. సగంలోనే సినిమా ఎందుకు ఆగింది? హీరో అయ్యి నిర్మాత బాధ్యతను కూడా పోషిస్తున్న శీను అనుకున్నట్టుగానే సినిమా ను పూర్తి చేసి రూపాను పెళ్లి చేసుకుంటాడా లేదా అనేదే తెలీయాలంటే ఈ మూవీ చూడాల్సిందే.
సమీక్ష:
నేటి యూత్ ను, ప్రేమికుల్ని, పెద్దోళ్లను, కెరీర్ లో ఎదగాలనుకుంటున్నోళ్లను అందరినీ దృష్టిలో పెట్టుకొని కథ రాసుకున్నారు దర్శకుడు హరిబాబు. ముఖ్యంగా హీరో హీరోయిన్ పాత్రల్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. హీరో దొంగ ఎలా అయ్యాడు? ఆ తరువాత సినిమాకు హీరో ఎలా అయ్యాడు అనే సన్నివేశాల్ని కామెడీ తో పాటు మంచి మెసేజ్ ఇస్తూ ముందుకు నడిపించాడు. వీలైనప్పుడల్లా ఆలీ, షకలక శంకర్, బ్రహ్మానందంతో కామెడీ చేయించాడు. హీరో క్యారెక్టర్ గురించి ఇంట్రడక్షన్ లోనే చెప్పేసి కథలోకి ఇన్ వాల్వ్ చేశాడు. కామెడీని ఇరికించినట్టుగా కాకుండా సందర్భానుసారంగా రావడంతో ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటారు. ఫస్టాఫ్ లో ఆలీ అండ్ గ్యాంగ్ సినిమా తీసేందుకు పడే కష్టాలు. ఆతర్వాత హీరో మానస్ హీరోగా అయ్యేందుకు పడే కష్టాలు ఫన్నీగా ఉంటాయి. రియల్ గా చాలా చోట్లా ఈ తరహా సన్నివేశాల్ని సినిమా ఇండస్ట్రీలో చూస్తుంటాం. వాటిని కళ్లకు కట్టినట్టుగా చూపించాడు దర్శకుడు. హైపర్ ఆది, కృష్ణ భగవాన్, దువ్వాసి మోహన్, గౌతంరాజు, చమ్మక్ చంద్రలాంటి కమెడియన్స్ ఫస్టాఫ్ లో తమ పంచ్ డైలాగ్స్ తో నవ్వించారు. సెకండాఫ్ లో హీరో మానస్, హీరోయిన్ నిత్య నరేష్ మధ్య మొదలయ్యే విలేజ్ లవ్ స్టోరీ బాగుంది. చివర్లో బ్రహ్మానందం ఎంట్రీ సర్ ప్రైజింగ్ గా ఉంటుంది. ఉన్న కొద్దిసేపు నవ్వించాడు. చివర్లో వచ్చే రెయిన్ సాంగ్ సినిమాకు హైప్ ను తీసుకొచ్చింది. మంచి మెసేజ్ తో దర్శకుడు సినిమాను ముగించాడు. అన్ని వర్గాల్ని మెప్పించే సన్నివేశాలతో గోలిసోడా తెరకెక్కింది. హీరో మానస్ మంచి ఎనర్జిటిక్ పెర్ ఫార్మెన్స్ చూపించాడు. డైలాగ్స్ తో పాటు డ్యాన్సులు అదరగొట్టాడు. ఫస్టాఫ్ లో హీరోగా సెకండాఫ్ లో దొంగగా వేరియేషన్స్ ఉన్న పాత్ర కావడంతో తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం దక్కింది. ఫస్టాఫ్ లో కారుణ్య ఓ హీరోయిన్ గా చక్కగా నటించింది. సెకండాఫ్ లో నిత్యా నరేష్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. హీరో మానస్ తో మంచి కెమెస్ట్రీ మెయింటైన్ చేసింది. తన నటనతో అందరినీ మెప్పిస్తుంది. భరత్ మ్యూజిక్ బాగానే ఉంది.. పెద్ద సినిమాల్లోని పాటలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. దానికి తగ్గట్టుగా పిక్చరైజేషన్ కూడా ఉంది. ముజీర్ మాలిక్ తన కెమెరా పనితనం చూపించాడు. నిర్మాత భువనగిరి సత్య సింధూజ ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టేశారు. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి.
దర్శకుడు మల్లూరి హరిబాబు ఓ వైపు ఎంటర్ టైన్ మెంట్ మరో వైపు మంచి మెసేజ్ తో అన్ని వర్గాల్ని మెప్పించే చిత్రంగా గోలిసోడా రూపొందించాడు. హీరో హీరోయిన్స్ పెర్ పార్మెన్స్, కామెడీ, పాటలు, డైలాగ్స్ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తాయి. దర్శకుడి టేకింగ్, నిర్మాణాత్మక విలువలు ప్రేక్షకుల్ని కథలోకి ఇన్ వాల్వ్ చేస్తాయి. కొత్త ధనాన్ని కామెడీ ని కోరుకునే ప్రతిఒక్కరూ చూడ తగ్గ సినిమా సోడా గోలి సోడా.. ముఖ్యంగా యువతకు ఓ మంచి మెసేజ్ లాంటి సినిమా ఇది. .. కనుక కుటుంబం మొత్తం థియేటర్ లోకి వెళ్లి చూడాల్సిన మూవీ.
కామెంట్ - కిక్ ఇచ్చే గోలీ సోడా
రేటింగ్ : 3/5
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి