నేషనల్ డే సెలవులలో కువైట్ విమానాశ్రయంలో 2 లక్షల 34 వేలమంది ప్రయాణికులు రావచ్చు

- February 17, 2018 , by Maagulf
నేషనల్ డే సెలవులలో కువైట్ విమానాశ్రయంలో 2 లక్షల 34 వేలమంది ప్రయాణికులు రావచ్చు

కువైట్ : నేషనల్ డే సెలవుల కాలంలోకువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పలువురు సందర్శకులతో కిట కిటలాడనున్నాయి.  సుమారు 2 లక్షల 34 వేలమంది ప్రయాణికులు రావచ్చని భావిస్తున్నట్లు  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శుక్రవారం తెలిపింది. ఫిబ్రవరి 22-26 తేదీల్లో జాతీయ సెలవుల సమయంలో1 లక్షా13 వేలమంది ప్రయాణికులకు కువైట్  విమానాశ్రయంలో చోటు  లభిస్తుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కాలంలో కువైట్ దేశం నుంచి 1 లక్షా  29 వేల 800 మంది ప్రయాణికులు వెలుపలకు బయలుదేరనున్నారు. 902 నుంచి 906 విమానాలు కువైట్ నుంచి వేరే ప్రాంతాలకు బయలుదేరనున్నట్లు అంచనా వేసినట్లు విమానాశ్రయ అధికారులు పేర్కొంటున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com