బుర్జ్‌ ఖలీఫాపై చైనీస్‌ న్యూ ఇయర్‌ సంబరాలు

- February 17, 2018 , by Maagulf
బుర్జ్‌ ఖలీఫాపై చైనీస్‌ న్యూ ఇయర్‌ సంబరాలు

దుబాయ్:డ్రాగన్‌ థీమ్‌తో కూడిన సౌండ్‌ అండ్‌ లైట్‌ షో బుర్జ్‌ ఖలీఫాపై అత్యద్భుతంగా జరిగింది. చైనీస్‌ న్యూ ఇయర్‌ వేడుకల్లో భాగంగా ఈ థీమ్‌ని దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫాపై ప్లే చేశారు. డౌన్‌ టౌన్‌ దుబాయ్‌ విజిటర్స్‌ ఈ అత్యద్భుత ఘట్టాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. యూఏఈలో నివసిస్తున్న చైనీయులు, అలాగే యూఏఈ సందర్శించేందుకు వచ్చినవారికి ఈ షో అమితానందాన్ని కలిగించింది. చైనాకు చెందిన ఓ వలసదారుడు హాటీ మాట్లాడుతూ, దుబాయ్‌లో ఇప్పటిదాకా జరిగిన చైనా న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌లో ఇదే అతి గొప్పదని అన్నారు. స్వదేశంలో వున్నామన్న భావన తమకు కలిగిందని చెప్పారు. కొరియన్‌ వలసదారుడు యుమి సాంగ్‌ మాట్లాడుతూ, చైనీస్‌కి మాత్రమే కాదు, అందరికీ ఈ సెలబ్రేషన్స్‌ ఎంతో ఆనందాన్నిచ్చాయని వివరించారు. ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ నిర్వహణలో ఈ సో జరిగింది. దుబాయ్‌ మాల్‌లో చైనీస్‌ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. యూఏఈలో 4,200 చైనా కంపెనీలు వుండగా, సుమారు 243,000 మంది చైనా జాతీయులు దుబాయ్‌లో నివసిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com