గేట్స్‌ కేంబ్రిడ్జ్‌ ఉపకారవేతనాలకు ఆరుగురు భారతీయ అమెరికన్ల ఎంపిక

గేట్స్‌ కేంబ్రిడ్జ్‌ ఉపకారవేతనాలకు ఆరుగురు భారతీయ అమెరికన్ల ఎంపిక

వాషింగ్టన్‌: ప్రతిష్ఠాత్మక గేట్స్‌ కేంబ్రిడ్జ్‌ ఉపకారవేతనాలకు.. ఈసారి ఆరుగురు భారతీయ అమెరికన్లు ఎంపికయ్యారు. అమెరికా నుంచి మొత్తంగా 35 మంది విద్యార్థులకు ఈ ఉపకారవేతనాలు దక్కాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులకు అమెరికాలోని కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో చదువుకునే అవకాశం కల్పించేందుకు.. బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ వీటిని అందిస్తోంది. దీనికి అమెరికా నుంచి ఎంపికైనవారిలో.. భారతీయ అమెరికన్లు ప్రణయ్‌ నాదెళ్ల, నీల్‌ దవే, అయాన్‌ మండల్‌, వైతీష్‌ వేలళావన్‌, కామ్య వారాగుర్‌, మోనిక కుల్లార్‌లు ఉన్నారు. మిగతా దేశాల నుంచి అర్హత సాధించే విద్యార్థుల వివరాలను ఏప్రిల్‌లో ప్రకటిస్తారు.

Back to Top