విషాదంలో బ్రహ్మానందం..
- February 19, 2018
టాలీవుడ్ హాస్యనటుడు గుండు హనుమంతరావు మరణవార్త తెలుసుకుని లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం తీవ్ర విషాదంలో మునిగిపోయారు. హనుమంతరావు ఇకలేరన్నవార్తను జీర్ణించుకోలేక దుఃఖంతో రోదిస్తున్నారు. బ్రహ్మానందంతో హనుమంతరావు దాదాపు 20 చిత్రాలకు పైగానే నటించారు. గత కొద్దీ రోజుల కిందట తన కుమారుడు నా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పరిస్థితిని విని గుండె బరువెక్కిందన్నారు. గుండు హనుమంతరావుతో 30 ఏళ్ల అనుభంధాన్ని ఏర్పరచుకున్నాను. "అహనా పెళ్ళంటా" చిత్రం తరువాత తనను భావ అని పిలవడం మొదలుపెట్టాడు. ఎంత ఎదిగిన ఒదిగి వుండే మనసత్త్వం కలిగిన వారు హనుమంతరావు అని అన్నారు. అంతేకాదు నాకున్న అతితక్కువ మంది స్నేహితుల్లో హనుమంతరావు ఒకరు అని విషణ్ణ వదనంతో బ్రహ్మానందం మాట్లాడారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి