కీలక నిర్ణయం దిశగా కాంగ్రెస్..
- February 19, 2018
మోడీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడంపై కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఏపీకి విభజన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శలు ఎదుర్కొంటున్న మోడీ ప్రభుత్వాన్ని పార్లమెంట్‌లో నిలదీయడానికి అవిశ్వాసమే సరైన మార్గమనుకొంటోంది కాంగ్రెస్. ఇప్పటికే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలంటూ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడం.. వైఎస్ జగన్ కూడా సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా దీనిపై చర్చించడం రాజకీయాల్లో హీట్ పెంచింది. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చలు జరుపుతున్నారు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు. మార్చి 5 నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతుండడంతో, ఆ లోపే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







