అబుదాబి హైవేలపై స్పీడ్‌ లిమిట్స్‌పై అధ్యయనం

- February 19, 2018 , by Maagulf
అబుదాబి హైవేలపై స్పీడ్‌ లిమిట్స్‌పై అధ్యయనం

అబుదాబి:అబుదాబి పోలీస్‌ జనరల్‌ కమాండ్‌, అబుదాబిలోని హైవేలపై స్పీడ్‌ లిమిట్‌కి సంబంధించి ఓ స్టడీ నిర్వహిస్తోంది. స్పీడ్‌ లిమిట్స్‌ని సవరించడమే ఈ స్టడీ లక్ష్యమని అధికారులు తెలిపారు. ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించిన అబుదాబి పోలీస్‌ - జనరల్‌ కమాండ్‌, స్టడీ పూర్తయ్యాక అందే నివేదిక అనుగుణంగా స్పీడ్‌ లిమిట్స్‌ని మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ స్పీడ్‌ లిమిట్స్‌ని మార్చే అవకాశం ఉంటే ఆ విషయాన్ని మీడియా ద్వారా వెల్లడిస్తామని అంటున్నారు అధికారులు. హైవేలపై గంటకు 20 కిలోమీటర్ల బఫర్‌ స్పీడ్‌ లిమిట్‌ విషయానికి స్వస్థి పలకాలన్న ఆలోచనతో అధికార యంత్రాంగం ఉన్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com