ఐఎస్లో చేరిన టర్కీ మహిళకు ఇరాక్లో మరణశిక్ష

- February 19, 2018 , by Maagulf
ఐఎస్లో చేరిన టర్కీ మహిళకు ఇరాక్లో మరణశిక్ష

బాగ్దాద్‌ : ఐఎస్‌లో చేరిన టర్కీ మహిళను ఇరాక్‌లోని ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. ఉగ్రసంస్థలకు మద్దతు తెలపడం, ఉగ్రసంస్థల్లో చేరడం లేదా చేర్పించడం చట్ట ప్రకారం పెద్ద నేరంగా పరిగణిస్తామని తీర్పు వెలువరించే సమయంలో న్యాయమూర్తి పేర్కొన్నారు. అంతేగాకుండా, ఐఎస్‌ శిబిరాల్లో శిక్షణ పొందిన మరో 10 మంది విదేశీ మహిళలకు జీవితఖైదు విధించినట్టు వెల్లడించారు. తాము వెలువరించిన తీర్పుపై అప్పీల్‌కు వెళ్లే అవకాశం కల్పిస్తున్నట్టు జడ్జీ తెలిపారు. ఉగ్రసంస్థల పట్ల ఆకర్షితులవుతున్న యువత పెద్ద సంఖ్యలో ఐఎస్‌లో చేరుతున్నారు. సిరియా, ఇరాక్‌ దేశాలకు వెళ్లి ఉగ్రశిబిరాల్లో చేరుతున్నారు. దీంతో, ఉగ్రసంస్థలను నియంత్రించే దిశగా ఇరాక్‌ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. దాడుల్లో పట్టుబడ్డ ఉగ్రవాదులను విచారించి సమాచారం రాబట్టుతున్నది. దోషులుగా తేలిన మిలిటంట్లను శిక్షిస్తున్నది. ఇరాక్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డ జర్మనీకి చెందిన ఓ మహిళకు గతనెలలో ఉరిశిక్ష విధించినట్టు ఇరాక్‌ ప్రభుత్వం పేర్కొన్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com