రంగస్థలం మూవీ రెండో పాట విడుదలకు టైం ఫిక్స్..!

- February 19, 2018 , by Maagulf
రంగస్థలం మూవీ రెండో పాట విడుదలకు టైం ఫిక్స్..!

హైదరాబాద్ : రాంచరణ్, సమంత కాంబినేషన్‌లో వస్తున్న మూవీ రంగస్థలం. సుకుమార్ డైరెక్షన్‌లో విలేజ్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే టీజర్‌తోపాటు తొలి పాట రిలీజైన విషయం తెలిసిందే. ఎంత సక్కగున్నావే లచ్చిమి అంటూ సాగే సాంగ్‌కు ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్టు నుంచి రెండో పాట విడుదల చేసేందుకు సుకుమార్ అండ్ టీం టైం ఫిక్స్ చేసింది. రంగస్థలం నుంచి రెండో పాటను ఈ వారమే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ మార్చి 30న థియేటర్లలో సందడి చేయనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com