మదిని మీటిన వర్షం-పార్ట్-5
- November 26, 2015
వర్ష వస్తుంది అని ఎంతో ఆశగా చూస్తున్న నాకు ఈ బండది దర్శనం ఇచ్చింది చీర నగలు వేసుకొని ఒక్క కిరీటం పెడితే పోలేరమ్మ లావు అయితే, గంగిరెద్దుకు ముస్తాబు చేస్తే ఎలా ఉంటుందో అలాగా ఉంది ఇది దీని మొహం … వర్షాని బయటకు పిలిపించడం ఎలా అని ఆలోచిస్తుంటే “దీన్ని ఇక్కడే మాటలతో లాక్ చేయి కొంచం సేపు చూసి వర్ష బయటకు వస్తుంది” అని చెప్పాడు మా హీరో … ఈ ఐడియా సూపర్ ఉంది అని దాన్ని పైన నుంచి కిందకి దాక ఎగాదిగా చూసి “వావ్ వాట్ ఏ బ్యూటీ మతిపోగోట్టేసారండి నిన్నటి నుంచి మిమ్మల్ని చూడనే లేదు ఇంత అందమైన అమ్మాయిలు లోపల కూర్చుంటే మా లాంటి అబ్బాయిలు పెళ్లి మండపంలో బోర్ కొట్టి గోలీలు ఆడుకోవాలి ఇంతకీ మీ పేరు ఏ ఊరు మీరెప్పుడు వచ్చారు ఎక్కడ ఉన్నారు నిన్నంత ” అని ప్రశ్నలు వేస్తుంటే బండది కొంచం సిగ్గు పడుతూ “ రేయ్ నేను లహరి మీ బండదాన్ని” నేను షాక్ తినట్టు మొహం పెట్టి “ఎవరు లారక్క నా” … “లారి కాదు లహరి” సారీ సారీ “లహరి అక్కనా ఓ భగవంతుడా అనవసరంగా అక్క అని కమిట్ అయ్యాను నిన్న కాని ఇలా కనపడి ఉనింటే లారక్క ఈపాటికి రెడ్ రోజ్ ఇచ్చి ప్రొపొసె చేసేవాణ్ణి ఏమి చేద్దాం … అక్క అనేసి నా మనసుకి ఎర్ర జెండా ఊపుకోవాల్సి వస్తోంది … దేవుడా ఏంటి ఈ పరీక్షా నాకు ఇలాంటి అందమైన అమ్మాయిలను అక్కల్ని చెల్లెళ్ళను చేస్తే ఇంకా నాకు అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారు” అని బాధ నటించి దాని వైపు చూసా పిచ్చిది నిజంగా అందగత్తే అనుకోని సిగ్గు పడుతూ గాల్లో తేలిపోతోంది .. బోర్ల పడింది రా పంది దాన్ని పోగిదినందుకు ఇటు తిరిగి ఉమ్మి తలుపు వైపు చూసా వర్ష వస్తుందేమో అని…తలుపు తీసుకొని వర్ష బయటకు వచ్చింది ఎంత అందంగా ఉంది దేవుడా… బండదాని వైపు తిరిగి ఏమయింది అని అడిగింది ఏమి చేస్తున్నావు ఇక్కడ … అది వర్ష గారు ఇందాక మీరు నన్ను సిగరాటేతో చూసారు కదా ఉరికే స్టైల్ కి ఫోటో కోసం అంతే నాకు దమ్ము కొట్టే అలవాటు లేదు కావాలంటే మా లారక్క మీద ఒట్టు అని బండదాని మీద చేయి పెట్ట”… “ఒరేయ్ ఎదవ మీ అబ్బాయిలు తప్పులు చేసి దొరికిపోయాక ఇలాగే చెప్తారు దానికి ఒట్టు పెట్టి నన్ను ఎందుకు చంపుతావురా నేను నమ్మను నిన్ను..” దీనయ్య అనుకోని దాని సైడ్ సీరియస్ గా చూసి “నువ్వు ముయి ” అని అరిచాను కళ్ళతో కోపంగా చూస్తూ …. వర్ష దగ్గరికి వెళ్లి చిన్నగా "నిజంగా తాగను అంది నాకు అలవాటు లేదు మీరు కోపంగా చూసేసరికి ఆ టెన్షన్ లో దమ్ము లాగి దగ్గుతో చాల ఇబ్బంది పడ్డాను అంతే ప్లీజ్ నమ్మండి.. "ఇవన్ని ఎందుకు చెప్తున్నారు మీరు తాగితే నాకెందుకు తాగాక పోతే నాకెందుకు" అంది కోపంతో వెళ్లిపోతుంటే... ఏంటిది ఇలా రివర్స్ అయింది… వర్షగారు అని పిలిచి బండది తిరిగి ఏంటి అని తల ఊపింది... దీనయ్య "ఏమి లేదు లారక్క నిన్ను చూసి నీ అంత బాగా రెడీ కమ్మని చెప్దాం అనుకున్న “ చాలు ఆపు నీ వెటకారం అర్థం అయింది నేనేమి బాగా లేను అని కోపడింది…. “నిజాలు బాగా తెల్సుకుంటావు అక్క అయిన బర్రె కి ముస్తాబు చేసినట్టు ఉన్నావు నీది అందం కాదు మందం ఫుల్ దుర్గంధం" అని ముక్కు మూసుకొని కన్నుకొట్టి వచ్చేసా” లోపలికి పోయి కోపంతో తలుపు వేసుకుంది …. వీణ్ణి తరువాత చూసుకుంట ఈ లహరి సంగతి ఏంటో చూపిస్తా … వర్ష నవ్వుతు తనని సముదాయించింది నేను చేసిన అల్లరి అందరికి చెప్పింది....
పెళ్లి మండపంకి వెళ్ళాము... అభి నందిని మొహాలు వెలిగిపోతున్నాయి … శివ పార్వతులను ఆవాహనం చేసుకుని ఆది దంపతుల్లగా పెళ్లి పీటలు మీద కుర్చుని సకల దేవతలను తమకు శుభం చేకూరాలని పూజలు చేస్తున్నారు … పచ్చటి తోరణాలు, పూల అలంకరణలు, అగ్ని హోమము, కలషాలు, ముత్తైదువులు,మేళ తాళాలు, మంత్రోచ్చారణలు , పిల్లల ఆట పాటలు, పెద్దల పలకరింపులు, ఆడవాళ్ళూ తమ నగలను అలకరణలు అందరికి చూపించే తాపత్రయాలు, సంప్రదాయమైన దుస్తుల్లో విరబోస్తున్న పదహారణాల తెలుగింటి అమ్మాయిల అందాలు, వాటిని చూడటానికి తమ పొట్టలను దాపెడుతూ కండలు చూపెడుతూ తాపత్రయ పడుతున్న అబ్బాయిలు, వియ్యాల వారికి కడుపు నిండా వడ్డించడానికి షడ్రుచులతో తయారయ్యి ఘుమ ఘుమ లాడిస్తున్న వంటకాలు …. అన్నిటికంటే ముఖ్యంగా ఒకరికి ఒకరు కలిసిపోయి మరణం తప్ప ఏది మిమ్మల్ని విడదీయదు అని చెప్పే జీలకర్ర బెల్లం .. సకల సంతోషాలతో అష్టఐశ్వర్యాలతో పిల్ల పాపలతో వర్ధిల్లండి అని దీవించడానికి తయారుగా ఉన్న తలంబ్రాలు…. ఇద్దరి తను మన ప్రాణాలను ఒకటిగా చేసి కడదాక బంధాన్ని మూడు ముళ్ళతో ముడి వేసే పవిత్రమైన తాళి బొట్టులతో ... ఈ మండపం సంతోషంగా నవ్వుల హరివిల్లు వెదజల్లుతూ కళకళ లాడుతూ ఉంది … లక్ష్మిదేవి లాగ నందు విష్ణుమూర్తి దర్పంతో అభి దీనికి ప్రతీకలుగా పీటలు మీద చిలిపి ఊసులు చెప్పుకుంటూ పెళ్లి ప్రమాణాలు చేసుకుంటున్నారు.. ఇంతలో అభి గాడు పిలిచి “రేయ్ ఇప్పుడు కాశి యాత్ర ఉంది ఎదవల్లార చెప్పులు అప్పుడే అమ్మాయి వాళ్ళు దాచిపెట్టారు అదిగో వర్ష పక్కన ఉన్నాయి అంట నందు చెప్పింది తనని మాయ చేసి తీసుకో లేకుంటే జేబుకి పెద్ద చిల్లు పడుతుంది అది పడితే మీకు అన్ని పార్టీలు కట్ ” దేవుడా ఈ వర్ష మాయలో పది అసలు ఈ విషయాలనే మరిచిపోయాను నేను, ఎప్పుడు అమ్మాయి తరుపు వాళ్ల కంటే మేమే ముందు ఉండేవాళ్ళం గెలవడానికి ఛాన్స్ ఇచ్చేవాళ్ళం కాదు … ఎలాగో వర్ష దగ్గరగా చేరుకొని చెప్పులు మీద చేయి వేసాను తను అది గమనించి ఇంకో పక్క పట్టుకొని లాగింది తన చేతుల నుంచి చెప్పుల్ని విడిపించాలని తన చేతి మీద నా చేయి వేశా... ఏమి అనుకుందో ఎమో అంతే ఇంకో చేయి నన్ను కొట్టడానికి పైకి లేపింది చెంప దాక వస్తోంది….. అరె నన్ను కొట్టేస్తుంది కదా అని షాక్ తో నేను వీడికి దెబ్బ పడుతోంది అనే ఆనందం తో లారి చూస్తా ఉన్నాం ….
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







