'యాక్టింగ్ రీసెర్చ్ సెంటర్' ని శేఖర్ కమ్ముల చేతులమీదుగా ఓపెనింగ్

- February 20, 2018 , by Maagulf
'యాక్టింగ్ రీసెర్చ్ సెంటర్' ని శేఖర్ కమ్ముల చేతులమీదుగా ఓపెనింగ్

మహేష్ గంగిమళ్ళ వంటి యాక్టింగ్ గురువు మన తెలుగు సినీ పరిశ్రమకి ఎంతో అవసరం అని ప్రముఖ సినీ దర్శకులు శేఖర్ కమ్ముల అన్నారు. హైదరాబాద్ లోని ఖాజాగూడలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో నెలకొల్పిన 'యాక్టింగ్ రీసెర్చ్ సెంటర్' ని ప్రారంభించిన తర్వాత శేఖర్ కమ్ముల.. ఆ సెంటర్ లోని పూర్వ, ప్రస్తుత విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించారు.
'అభినయయోగం' అనే నూతన ప్రక్రియతో నటన నేర్పుతున్న మహేష్ లో డెడికేషన్, సిన్సియారిటీ అంటే తనకు ఇష్టం అని, అది నచ్చే ఇక్కడకు వచ్చానని తెలిపారు. మహేష్ శిష్యుల నుంచి నటన రాబట్టుకోవడం దర్శకులకు ఎంతో సులువైన పని అని అన్నారు. తప్పకుండా దేశంలో ఇదో గొప్ప ఇన్స్టిస్టూట్ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి విద్యార్థులతో తన సినీ అనుభవాలను పంచుకుని, కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. భవిష్యత్ లో తన చిత్రాలకు మహేష్ నాలెడ్జ్ ని ఉపయోగించుకుంటానని శేఖర్ కమ్ముల తెలిపారు. 
మహేష్ గంగిమళ్ళ మాట్లాడుతూ.. యాక్టింగ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా నటన నేర్చుకోవాలనే వారికి "అభినయయోగం, అవతార్ కాన్సెప్ట్, లిటిల్ వింగ్స్, లూప్ టెక్నిక్, నౌ యువర్ యాక్టింగ్, యాక్టింగ్ అవెర్నెస్ వర్క్ షాప్స్" ద్వారా నటనలో చక్కని మెళుకువలు నేర్పిస్తామని తెలిపారు. వివరాలు కావాలనుకునే వాళ్ళు సెల్ నెం: 9392345674, www.actingresearchcentre.com లో సంప్రదించవచ్చని సూచించారు..
ఈ కార్యక్రమంలో మహేష్ దగ్గర నేర్చుకున్న పలువురు సినీ హీరోలు, నటులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com