కాస్త బొద్దుగా, చబ్బీగా ఉండటంతో రంగస్థలం చేజార్చుకున్న రాశీ ఖన్నా
- February 20, 2018
ఊహలు గుసగుసలాడే మూవీలో హీరోయిన్ గా నటించిన రాశీ ఖన్నా కాస్త బొద్దుగా, చబ్బీగా కనిపించింది.. స్లిమ్ అంటూ తపించే టాలీవుడ్ హీరోలకు ఆ లావు అడ్డుకావడంతో సరైన అవకాశాలు ఆమెకు దక్కలేదు.. బొద్దు అడ్డు అని భావించిన రాశీఖన్నా పట్టుదలతో తన శరీరంలో పేరుకపోయిన కొవ్వును కరిగించింది.. దీంతో ఆమెకు లవకుశ మూవీలో ఎన్టీఆర్ సరసన నటించే చాన్స్ దక్కించుకుంది.. అంతకుముందు రామ్ చరణ్ మూవీ రంగస్థలం మూవీ కోసం ఆమె పేరు పరిశీలనకు వచ్చినా ఆ హీరో ముందు ఆమె లావుగా కనిపిస్తుందని భావించిన సుకుమార్ ఆమె స్థానంలో సమంతను తీసుకున్నాడు.. కట్ చేస్తే రాశీ ఇటీవల తొలి ప్రేమలో వర్ష పాత్రలో నటించి అందర్ని ఆకట్టుకుంటుంది.. నాజూగ్గా మారడంతో పాటు మంచి నటన ఉన్న హీరోయిన్ అనే ప్రశంసలు వచ్చాయి.. దీంతో ఆమెకు అనూహ్యంగా తిరిగి రామ్ చరణ్ సరసన నటించేఅవకాశం దక్కిందని టాక్.. అదీ కూడా రాజమౌళి దర్శకత్వంలో చెర్రీ, తారక్ లతో తీస్తున్న మల్టీ స్టారర్ మూవీలో.. ఈ మూవీలో నటించే అవకాశం నిజంగా వస్తే రాశీ ఖన్నా దశ తిరిగినట్లే.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







