దుబాయ్‌ రోడ్డుకి యూఏఈ రాయల్‌ వార్‌ హీరో పేరు

- February 20, 2018 , by Maagulf
దుబాయ్‌ రోడ్డుకి యూఏఈ రాయల్‌ వార్‌ హీరో పేరు

దుబాయ్‌ రూలర్‌, యూఏఈ ప్రైమ్‌ మినిస్టర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, దుబాయ్‌లోని అకడమిక్‌ సిటీ రోడ్‌కి యూఏఈ వార్‌ హీరో షేక్‌ జాయెద్‌ బిన్‌ హమదాన్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ పేరును పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. షేక్‌ జాయెద్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ నహ్యాన్‌ మనవడు షేక్‌ జాయెద్‌ బిన్‌ హమమదాన్‌, యెమెన్‌లోని షబ్వా గవర్నరేట్‌ పరిధిలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో గాయపడ్డారు. విదేశాల్లో వైద్య చికిత్స పొందిన ఆయన ఇటీవల యూఏఈకి తిరిగొచ్చారు. ట్విట్టర్‌ ద్వారా దుబాయ్‌ రోడ్డుకి ఆయన పేరు పెడుతున్నట్లు షేక్‌ మొహమ్మద్‌ వెల్లడించారు. ఆ రోడ్డుకి వార్‌ హీరో పేరు పెట్టడం ద్వారా యువతలో దేశభక్తి ఉప్పొంగుతుందని ఆయన పేర్కొన్నారు. జాయెద్‌ బిన్‌ హమదాన్‌ అలాగే దేశ యువత, దేశానికి సేవ చేస్తూనే ఉండాలని ఆయన ఆకాంక్షించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com