షారుక్ అంటే ఇష్టం.. రోబో ‘సోఫియా’ సమాధానాలకు టెక్ దిగ్గజాల ఆశ్చర్యం

- February 20, 2018 , by Maagulf
షారుక్ అంటే ఇష్టం.. రోబో ‘సోఫియా’ సమాధానాలకు టెక్ దిగ్గజాల ఆశ్చర్యం

షారూక్‌ ఇష్టం

హాంగ్‌కాంగ్‌ చాలా ఇష్టం 
మానవాళిపై ఆధిపత్యం చేయాలన్న ఆలోచన లేదు 
సౌదీ పౌరసత్వాన్ని మహిళా సాధికారిత కోసం వినియోగిస్తా 
వరల్డ్‌ ఐటీ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా రోబో సోఫియా

ప్రపంచ ఐటీ సదస్సులో రెండో రోజు (మంగ ళవారంనాడు) నూతన సాంకేతికతలు, కృతిమ మేధస్సు అంశాలపై చర్చలు కొనసాగాయి. ఈ సంద ర్భంగా రోబో సోఫియా ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. రోబో సోఫియాను దాని సృష్టికర్త, డేవిడ్‌ హాన్సన్‌ను ఇంటర్వ్యూ చేశారు. మానవత్వంతోనే మెరుగైన భవిష్యత్‌ అనే అంశంపై రోబో సోఫియా ప్రసంగం కొనసాగింది. ఈ సందర్భంగా చిట్టిచిట్టి మాటలతో సోషియా ప్రసంగం అందరినీ అకట్టు కుంది. రోబోకు ప్రత్యేక నిబంధనలు అవసరం లేదని సోఫియా చెప్పింది.

సౌదీ పౌరసత్వాన్ని మహి ళా సాధికారత కోసం వినియోగిస్తానని స్పష్టం చేసింది. అందరికీ విశ్రాంతి అవసరమని చెప్పింది. తనతో సహా ఎవరికీ ప్రత్యేక హక్కులు అవసరం లేదని తెలిపింది. తాను ఇంకా చిన్నదాణ్ణే, బ్యాంకు ఖాతా లేదు. బిట్‌ కాయిన్లు కొనుగోలు చేయలేదని వెల్లడించింది. తానెప్పుడూ మనస్తాపానికి గురికా లేదని చెప్పింది.

మానవాళిపై అధిపత్యం చెలాయించాలన్న ఆలోచన తనకు లేదని, మానవాళితో కలిసి మెలిసి సఖ్యతతో ఉండాలన్నదే తన అభిప్రాయమన్నది. మానవులు సృజనాత్మక కలిగిన వారని తెలిపింది. మానవజాతి, రోబోలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని సోఫియా స్పష్టం చేసింది. తనకు ఇష్టమైన నటుడు షారూక్‌ ఖాన్‌ అని చెప్పింది. తాను తిరిగిన చాలా ప్లేస్‌ల్లో హాంగ్‌కాంగ్‌ చాలా ఇష్టమని తెలిపింది. ప్రపంచంలో అందరూ ప్రేమగా ఉండాలన్నదే నా ఇంటెన్షన్‌, అందరినీ ప్రేమించాలన్నదే తన అభిమతమని సోఫియా స్పష్టం చేసింది. థాంక్యూకి మించిన గొప్ప పదం లేదని స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com