కువైట్ లోని రహదారులన్నింటిని నిఘా కెమెరాలతో పర్యవేక్షిస్తారు

- February 21, 2018 , by Maagulf
కువైట్ లోని రహదారులన్నింటిని నిఘా కెమెరాలతో పర్యవేక్షిస్తారు

కువైట్:కువైట్ లోని అన్ని ప్రధాన రహదారులు నిఘా కెమెరాల సహాయంతో వారంలో 24 గంటల పాటు పర్యవేక్షణను కొనసాగిస్తామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ట్రాఫిక్ వ్యవహారాల సహాయక సహాయమంత్రి మేజర్ జనరల్ ఫహ్ద్ అల్ షువేవా తెలిపారు. ట్రాఫిక్ విభాగం 269 స్థిర , సంచార  కెమెరాలతో పాటు179 ఉన్నత సాంకేతికతతో  కూడిన  ప్రత్యేకమైన కెమెరాలతో పాటు ప్రధాన ప్రాంతాల్లో అమర్చబడ్డాయి. రోజువారీగ 190 నుంచి  200 ట్రాఫిక్ వైవిధ్యమైన ప్రమాదాలు జరిగే చోట్ల  నిఘా కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.2017 లో జెనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్  70,000 కంటే ఎక్కువ ట్రాఫిక్ ప్రమాదాలను నమోదు చేసింది, దాని ఫలితంగా 428 మంది ప్రజలు తమ అమూల్యమైన ప్రాణాలను కోల్పోయారు. అలాగే, 10,000 మందికి పైగా గాయపడ్డారు. అదేవిధంగా లైసెన్సు లేకుండా నిర్లక్ష్యంగా  డ్రైవింగ్ చేసిన 164 మంది ప్రవాసీయులను దేశం నుండి పంపించవేయబడ్డారు. తీవ్రమైన ఉల్లంఘనలను మంత్రిత్వ శాఖ ఎట్టి పరిస్థితులలో సహించబోదని  ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com